యాప్నగరం

ఢిల్లీలో WWE లైవ్ పోటీలు..!

భారత్‌లో రెజ్లింగ్‌ని ఇష్టపడే అభిమానులకి తీయటి కబురు. ఈ ఏడాది డిసెంబరు‌లో ఢిల్లీ వేదికగా

TNN 12 Sep 2017, 3:55 pm
భారత్‌లో రెజ్లింగ్‌ని ఇష్టపడే అభిమానులకి తీయటి కబురు. ఈ ఏడాది డిసెంబరు‌లో ఢిల్లీ వేదికగా రెండు డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్లని నిర్వహించనున్నారు. 2016, జనవరిలో ఢిల్లీ, ముంబయి, బెంగళూరులో ఈ పోటీలను నిర్వహించారు. అప్పట్లో వాటికి అభిమానుల నుంచి మంచి ఆరణ లభించింది. దీంతో మరోసారి ఢిల్లీ వేదికగా డిసెంబరు 7, 8న ఈ ఈవెంట్లని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Samayam Telugu wwe to hold two live events in india in december
ఢిల్లీలో WWE లైవ్ పోటీలు..!


భారత సంతతికి చెందిన రెజ్లర్ జిందర్ మహల్ హెవీ వెయిట్ ఛాంపియన్‌షిప్ గెలవడంతో భారత్‌లో డబ్ల్యూడబ్ల్యూఈకి ఆదరణ మరింత పెరిగింది. గతంలో 2007లో ద గ్రేట్ ఖలీ ఈ ఛాంపియన్‌షిప్‌ని గెలిచి రికార్డు నెలకొల్పాడు. మళ్లీ ఇన్నాళ్లకి ఓ భారత సంతతి వ్యక్తి సత్తాచాటుతుండటంతో నిర్వాహకులు సైతం ఇక్కడ ఈవెంట్లని పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫైట్స్ అన్నీ స్క్రిప్ట్ ప్రకారం నడిచినా.. లైవ్‌లో స్టంట్స్‌ చూడాలనే భారతీయ రెజ్లింగ్ అభిమానుల కోరిక తీర్చేందుకే ఈ ఈవెంట్లు అని నిర్వాహకులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.