యాప్నగరం

వీడియో: Samsung Galaxy M30s ఒక్క ఛార్జింగ్‌తో అర్జున్ వాజ్‌పేయ్ 3700కి.మీ జర్నీ

మార్కెట్లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసేందుకు శాంసంగ్ గెలాక్సీ M30s సిద్ధంగా ఉంది. అమెజాన్, శాంసంగ్ వెబ్‌సైట్లలో 6000mAH బ్యాటరీతో వస్తున్న #GoMonster విక్రయాలు జరపనున్నారు. మీరూ ఓ లుక్కేయండి.

Samayam Telugu 17 Sep 2019, 9:42 am
Samsung Galaxy M30s బ్యాటరీని పరీక్షించడానికి అమిత్ సాధ్ విసిరిన సవాలును ప్రముఖ పర్వతారోహకుడు అర్జున్ వాజ్ పేయ్ స్వీకరించినప్పటి నుంచీ అందరి కళ్లూ అతనిపైనే ఉన్నాయి. మౌంట్ ఎవరెస్టును అధిరోహించిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా అర్జున్ 2010లో రికార్డు సాధించిన విషయం తెలిసిందే. Galaxy M30sకు కేవలం ఒక్కసారి మాత్రమే చార్జింగ్ పెట్టి భారతదేశ తూర్పు సరిహద్దులో సూర్యోదయాన్ని చూసి, అనంతరం ఏకబిగిన 3700 కిలోమీటర్లు ప్రయాణించి పశ్చిమ తీరాన సూర్యాస్తమయాన్ని చూడాలనే #GoMonster అద్భుతమైన ఛాలెంజ్‌లో అర్జున్ విజయం సాధించాడు.
Samayam Telugu Arjun


అసలు అది ఎలా సాధ్యమైందని మనం ఆశ్చర్యపోయాం! ఎందుకంటే అతను వెళ్లే దారిలో అన్నీ అవరోధాలే. ఈ దారిలో అతను కేవలం ప్రజారవాణాను మాత్రమే ఉపయోగించాలి. అలాగే చాలా దూరం ప్రయాణించాలి. కానీ సహజంగానే సాహసోపేత స్వభావం కలిగిన అర్జున్ అరుణాచల్ ప్రదేశ్ లోని చీకటైన డాంగ్ లోయలో తన ప్రయాణాన్ని ప్రారంభించి రెండు రోజుల అనంతరం కచ్ చేరుకోవడం ద్వారా Samsung Galaxy M30sతో అతను మరో విజయగాథ లిఖించాడు. ఏమైందో ఊహించారా? శాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ బ్యాటరీ అప్పటికీ కొనసాగుతూనే ఉంది. అర్జున్ ప్రయాణంలో ఉన్న ఎత్తుపల్లాలను చూడటానికి, శాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ యొక్క బ్రహ్మాండమైన 6000mAH బ్యాటరీ సాయంతో అతను విజయ తీరానికి ఎలా చేరుకున్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి.

ఈ వారం విడుదల కాబోతున్న ఎంతో శక్తి గల శాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ లేకపోతే రోమాలు నిక్కబొడుచుకునేంత సాహసోపేతమైన అర్జున్ ప్రయాణం సాధ్యమయ్యేది కాదు. అత్యుత్తమమైన ఫీచర్లతో, కొన్ని లక్షల మంది అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందరినీ #GoMonsterగా తయారు చేయడానికి ఇది రూపొందించబడింది. ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలుసుకోవడానికి అమెజాన్, శాంసంగ్ అధికారిక వెబ్ సైట్‌లపై ఓ కన్నెసి ఉంచండి.

గమనిక: ఈ ఆర్టికల్ Samsung తరఫున ‘టైమ్స్ ఇంటర్నెట్ స్పాట్ లైట్’ బృందం వారిచే ప్రచురితమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.