యాప్నగరం

ఎలిమినేటర్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి..!

హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగియగానే వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ని నిలిపివేశారు. మధ్యలో ఓ పది నిమిషాల

TNN 17 May 2017, 11:43 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగిస్తోంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (37: 35 బంతుల్లో 2x4, 2x6), విలియమ్సన్ (24: 26 బంతుల్లో 2x4, 2x1), విజయ్ శంకర్ (22: 17 బంతుల్లో 2x4, 1x6) నిలకడగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగియగానే వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ని నిలిపివేశారు. మధ్యలో ఓ పది నిమిషాల పాటు వర్షం నిలవడంతో గ్రౌండ్ సిబ్బంది కవర్లను తొలగిస్తుండగా మళ్లీ వర్షం జోరందుకుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే లీగ్ దశలో మెరుగ్గా ఉన్న హైదరాబాద్‌ని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది.
Samayam Telugu srh vs kkr eliminator
ఎలిమినేటర్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి..!


11:52 గంటలలోపు మ్యాచ్ మొదలైతే.. 20 ఓవర్ల మ్యాచ్ జరుగుతంది.
12:58.. అయితే 5 ఓవర్ల మ్యాచ్
1:20.. అయితే సూపర్ ఓవర్ ద్వారా విజేతని నిర్ణయిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.