యాప్నగరం

మ్యాచ్‌ గ్యాప్‌లోనే దుబాయ్ వెళ్లొస్తున్న స్టీవ్‌స్మిత్

సీజన్‌లో ఇప్పటికే ఐదు మ్యాచ్‌లాడిన రైజింగ్ పుణె జట్టు కేవలం రెండింట్లో మాత్రమే గెలుపొందింది. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో

TNN 20 Apr 2017, 4:33 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తుండటంతో ఆ జట్టు కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. దీంతో మానసిక ప్రశాంతత కోసం ఫ్యామిలీతో కలిసి స్మిత్ దుబాయ్ వెళ్లాడు. గత ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడిన రైజింగ్ పుణె జట్టుకి రానున్న శనివారం వరకు మ్యాచ్‌లు లేకపోవడంతో ఈ గ్యాప్‌లోనే పుణె కెప్టెన్ విహారానికి ప్లాన్ చేసుకున్నాడు. ‘ఆరు రోజుల మ్యాచ్ బ్రేక్‌లో రెండు రోజులు దుబాయ్‌లో సరదాగా గడుపుతున్నాను’ అంటూ స్మిత్ సోషల్ మీడియాలో తాజాగా అభిమానులతో పంచుకున్నాడు.
Samayam Telugu steven smith goes on a break ahead of sunrisers hyderabad clash
మ్యాచ్‌ గ్యాప్‌లోనే దుబాయ్ వెళ్లొస్తున్న స్టీవ్‌స్మిత్


సీజన్‌లో ఇప్పటికే ఐదు మ్యాచ్‌లాడిన రైజింగ్ పుణె జట్టు కేవలం రెండింట్లో మాత్రమే గెలుపొందింది. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. గత ఏడాది ధోనీ కెప్టెన్సీలోనే పుణె జట్టు పేలవ ప్రదర్శనతో చివరి స్థానంలో నిలవడంతో ఫ్రాంఛైజీ తాజా సీజన్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీని తప్పించి స్టీవ్‌స్మిత్‌కి పగ్గాలప్పగించింది. తొలి మ్యాచ్‌లోనే ముంబయిపై ఘన విజయాన్ని అందుకున్న పుణె అనంతరం వరుసగా పంజాబ్, ఢిల్లీ, గుజరాత్ చేతిలో ఓడిపోయింది. అయితే గత ఆదివారం బెంగళూరు జరిగిన మ్యాచ్‌లో పుణె 27 పరుగుల తేడాతో గెలుపొందడం ఆ జట్టుకి ఉపశమనం ఇచ్చేదే. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పుణె వేదికగా రైజింగ్ పుణె జట్టు శనివారం మ్యాచ్‌లో తలపడనుంది. టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న హైదరాబాద్‌తో ఆసక్తికరమైన పోరుకి ముందు ఫ్యామిలీ టూర్ స్మిత్‌కి ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.