యాప్నగరం

నకిలీ ఓట్లను అరికట్టే ఆధార్ ఈవీఎం రెడీ!

ఎన్నికల్లో నకిలీ ఓట్లను అరికట్టేందుకు కొంతమంది విద్యార్థులు సరికొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (EVM)ను అభివృద్ధి చేశారు.

TNN 25 Feb 2017, 6:05 pm
ఎన్నికల్లో నకిలీ ఓట్లను అరికట్టేందుకు కొంతమంది విద్యార్థులు సరికొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (EVM)ను అభివృద్ధి చేశారు. ఓటర్ల ఆధార్ గుర్తింపు ఆధారంగా పనిచేసే ఈ కొత్త ఈవీఎం‌ను హ్యాక్ చేయడం కుదరదు. ఈ వైర్‌లెస్ ఈవీఎంను చెన్నైలోని వెల్‌టెక్ యూనివర్సిటీ విద్యార్థులు తయారుచేసారు.
Samayam Telugu students develop aadhaar based hack proof electronic voting machine
నకిలీ ఓట్లను అరికట్టే ఆధార్ ఈవీఎం రెడీ!


వైఫై, బ్లూటూత్ లాంటి వైర్‌లెస్ లోకల్ ఏరియా నెట్‌వర్కులపై పనిచేసే ఈ ఈవీఎంను ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కె. గణేశ్, పి. శివప్రియ తయారుచేసారు. గణేశ్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యార్థి కాగా, శివప్రియ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ విద్యార్థిని. ఈ కొత్త ఈవీఎంలో ఓటర్ల ఆధార్ కార్డు ఆధారంగా కూడా ఓట్లు వేయొచ్చు. ఈవీఎంకు అమర్చిన స్కానర్ వద్ద ఓటర్ల ఆధార్ కార్డ్ మీద ఉన్న బార్‌కోడ్ ఉంచితే ఆటోమేటిక్‌గా ఓటు నమోదు అవుతుంది. ఒకసారి ఆధార్ కార్డుతో ఓటువేసిన తరవాత మరోసారి అదే ఓటర్ ఓటు వేయడానికి వీలుపడదు. ఎందుకంటే రెండోసారి ఒకే ఆధార్ నంబర్‌ను ఈ ఈవీఎం తీసుకోదు.

అలాగే ఓటర్ల ఐరిస్, వేలి ముద్రలను కూడా ఈ ఈవీఎంలో పరిశీలించొచ్చు. ఈ కొత్త మిషన్ గురించి ప్రభుత్వ అధికారులకు వివరించి అధికారికంగా అనుమతి పొందాలని ఈ ఇద్దరు విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే కనుక ఆధార్ వ్యవస్థ సర్వర్‌కు ఈ మెషీన్‌ని అనుసంధానించి పరీక్షిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.