యాప్నగరం

వోహ్రా పోరాడినా.. సన్‌‌రైజర్స్‌దే గెలుపు

పంజాబ్ జట్టులో మనన్ వోహ్రా అద్భుత ఇన్నింగ్స్‌తో ఒంటరి పోరాటం చేయడంతో దాదాపు మ్యాచ్ పంజాబ్ చేతుల్లోకి వెళ్లిపోయింది.

TNN 17 Apr 2017, 11:52 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ గాడిన పడింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో హైదరాబాద్ 5 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. డేవిడ్ వార్నర్ (70 నాటౌట్: 54 బంతుల్లో 7x4, 2x6) అర్ధశతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ జట్టులో మనన్ వోహ్రా (95: 50 బంతుల్లో 9x4, 5x6) అద్భుత ఇన్నింగ్స్‌తో ఒంటరి పోరాటం చేయడంతో దాదాపు మ్యాచ్ పంజాబ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. కానీ.. బౌలర్ భువనేశ్వర్ కుమార్ (5/19) 19వ ఓవర్‌లో వోహ్రాతో పాటు కరియప్ప వికెట్ తీసి సన్‌రైజర్స్ శిబిరంలో ఆనందం నింపాడు. ఆఖరికి పంజాబ్ 19.4 ఓవర్లలోనే 154 పరుగులకు ఆలౌటైంది.
Samayam Telugu sunrisers hyderabad won by 5 runs
వోహ్రా పోరాడినా.. సన్‌‌రైజర్స్‌దే గెలుపు


అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ (15), హెన్రిక్యూస్ (9), యువరాజ్ సింగ్ (0) నిరాశపరిచినా.. ఒక ఎండ్‌లో చివరి వరకూ అజేయంగా నిలిచిన వార్నర్ జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. మధ్య ఓవర్లలో నమన్ ఓజా (34: 20 బంతుల్లో 2x4, 1x6) కాసేపు కెప్టెన్‌కి సహకారం అందించినా కీలక సమయంలో అతను వికెట్ చేజార్చుకున్నాడు. దీపక్ హుడా (12), రషీద్ ఖాన్ (6) చివర్లో విలువైన పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అక్షర్ పటేల్, మోహిత్ శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, కరియప్ప తలో వికెట్ తీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.