యాప్నగరం

జగన్ రెడ్డి నీ పాలనకు ఇవే నిదర్శనం.. ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ఆదాయం బాగుంటే ప్రభుత్వ వైఫల్యాలు సామాన్యుడి జీవితాలను ఎందుకు చిధ్రం చేస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) సీఎం జగన్‌ను (YS Jaganmohan Reddy) ప్రశ్నించారు. ప్రజలను బాధిస్తున్న పన్నులు ఎటుపోతున్నాయని.., లక్షల కోట్ల అప్పులు ఏమవుతున్నాయని నిలదీశారు. రాష్ట్ర ఆదాయం గాడిన పడిందన్న సీఎం వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయన ట్వీట్ (Tweet) చేశారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 7 Oct 2022, 4:31 pm
YSRCP ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆదాయం గాడిన పడిందన్న సీఎం జగన్ (YS Jaganmohan Reddy) వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. 'రాష్ట్రంలో పాలనా దుస్థితికి ఈ ఘటనలే ఉదాహరణలు' అంటూ ట్విట్టర్ (Twitter) వేదికగా పలు ఘటనలను ఆయన ప్రస్తావించారు.
Samayam Telugu cbn new
చంద్రబాబు


కాకినాడ జిల్లా జె.తిమ్మాపురంలో ఆసుపత్రికి వెళుతున్న పసిబిడ్డ గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన ఘటనను చంద్రబాబు గుర్తు చేశారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవటంతో క్యాన్సర్ బాధితుడైన తండ్రి వైద్యానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ కాంట్రాక్టర్ వెంకట శివప్ప ఘటనను ట్వీట్ (CBN Tweet) చేశారు. ఏపీ ఆదాయం గాడిన పడిందన్న సీఎం సమీక్ష వార్తను, వారం రోజులు గడుస్తున్నా.. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ అందని అంశాన్ని పోలుస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్ర ఆదాయం బాగుంటే ప్రభుత్వ వైఫల్యాలు సామాన్యుడి జీవితాలను ఎందుకు చిధ్రం చేస్తున్నాయని చంద్రబాబు జగన్ సర్కారును ప్రశ్నించారు. ప్రజలను బాధిస్తున్న పన్నులు ఎటుపోతున్నాయని.., లక్షల కోట్ల అప్పులు ఏమవుతున్నాయని నిలదీశారు.

"రాష్ట్రంలో పాలనా దుస్థితికి ఈ ఘటనలే ఉదాహరణలు. ప్రభుత్వ వైఫల్యాలు సామాన్యుడి జీవితాలను ఎలా చిధ్రం చేస్తున్నాయో చెప్పడానికి ఇవి నిదర్శనం. ప్రజలను బాదేస్తున్న పన్నులు ఎటుపోతున్నాయి... లక్షల కోట్ల అప్పులు ఏమవుతున్నాయి ? ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే !" - చంద్రబాబు
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.