యాప్నగరం

Doctor strange మొబైల్ వచ్చేస్తోంది.. మార్వెల్ స్టూడియోస్‌తో చేతులు కలిపిన ఇన్ఫినిక్స్

Infinix Note 12 - Marvel Studios : మొబైల్‌ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్.. నోట్ 12 సిరీస్ కోసం మార్వెల్ స్టూడియోస్‌తో చేతులు కలిపింది. ఈ సిరీస్‌లో డాక్టర్ స్ట్రేంజ్ (Doctor Strange) ప్రత్యేక ఎడిషన్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది

Authored byKrishna Prakash | Samayam Telugu 7 May 2022, 5:53 pm
అవెంజర్స్‌తో పాటు ఎన్నో భారీ చిత్రాలను నిర్మించిన సంస్థ మార్వెల్ స్టూడియోస్‌ ( Marvel Studios ) తో మొబైల్‌ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ ( Infinix ) చేతులు కలిపింది. ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్ (Infinix Note 12 Series ) కోసం ఈ భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంది. నోట్ 12 సిరీస్ మొబైళ్లను ఈ నెల 20న భారత్‌లో ఇన్ఫినిక్స్ లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 12, నోట్ 12 టర్బో (Infinix Note 12 Turbo) రానున్నాయి. అయితే డాక్టర్ స్ట్రేంజ్ స్పెషల్ ఎడిషన్ మొబైల్‌ను కూడా విడుదల చేయాలని ఇన్ఫినిక్స్ నిర్ణయించుకుంది. అందుకే మార్వెల్ స్టూడియోస్‌తో చేతులు కలిపింది.
Samayam Telugu మార్వెల్ స్టూడియోస్‌తో చేతులు కలిపిన ఇన్ఫినిక్స్ (Photo: Infinix)
Doctor strange Infinix Note 12


మార్వెస్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి 28వ చిత్రంగా డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ (Doctor Strange in the Multiverse of Madness) సినిమా తాజాగా విడుదలైంది. మార్వెల్ క్యారెక్టర్‌లో డాక్టర్ స్ట్రేంజ్ చాలా ఫేమస్. అందుకే ఈ క్రేజ్‌ను యాడ్ చేసుకునేందుకు నోట్ 12 సిరీస్‌లో స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొచ్చేందుకు ఇన్ఫినిక్స్ సిద్ధమైంది. డాక్టర్ స్ట్రేంజ్ స్పెషల్ ఎడిషన్ ఫోన్‌ ప్రత్యేకమైన డిజైన్ ఎలిమింట్స్‌తో వస్తుంది. డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ సర్కిల్ (spell circle) డిజైన్ ఈ మొబైల్‌ బ్యాక్ ప్యానెల్‌పై ఉంటుందని సమాచారం.

ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్ స్పెసిఫికేషన్లు
Infinix Note 12 Series Specifications | ఈ నెల 20వ తేదీన ఇన్ఫినిక్స్ నోట్ 12 సిరీస్ మొబైళ్లు లాంచ్ కానుండగా.. కొన్ని స్పెసిఫికేషన్లను ఆ సంస్థ టీజ్ చేసింది. ఇన్ఫినిక్స్ నోట్ 12, నోట్ 12 టర్బో ఫోన్లు 6.7 ఇంచుల FHD+ AMOLED డిస్‌ప్లేతో లాంచ్ కానున్నాయి. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో హెచ్‌డీ కంటెంట్‌ను స్ట్రీమ్ చేసుకునేలా వైడ్‌వైన్ ఎల్1 (Widevine L1) సపోర్ట్‌ను కలిగి ఉంటాయి.

Infinix Note 12 మొబైళ్లు 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లాంచ్ కానున్నాయి. ప్రత్యేకంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) లో ఈ సిరీస్ అందుబాటులో ఉంటుంది. ఫొటోలను బట్టి చూస్తే ఇన్ఫినిక్స్ నోట్ 12, ఇన్ఫినిక్స్ నోట్ 12 టర్బోతో పాటు డాక్టర్ స్ట్రేంజ్ స్పెషల్ ఎడిషన్ కూడా వెనుక మూడు కెమెరాలతో సెటప్‌తో రానున్నట్టు తెలుస్తోంది.

మార్వెల్ స్టూడియోస్ భాగస్వామ్యంతో నోట్ 12 సిరీస్‌ను తీసుకువస్తుండడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఇన్ఫినిక్స్ ఇండియా సీఈవో అనిశ్ కపూర్ చెప్పారు. అలాగే నోట్ 12 సిరీస్ విభిన్న వేరియంట్లలో లభ్యవుతుందని వెల్లడించారు. ముఖ్యంగా AMOLED డిస్‌ప్లే, widevine L1 సపోర్ట్‌ను Infinix హైలైట్ చేస్తోంది.

Also Read: ఏప్రిల్‌లో లాంచ్ అయిన టాప్‌-10 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే - ప్రత్యేకతలు, అదిరిపోయే స్పెసిఫికేషన్లతో - మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో చూడండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.