యాప్నగరం

Nokia : బడ్జెట్ రేంజ్‌లో నోకియా నుంచి మూడు ఫోన్లు విడుదల.. ధర, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..

నోకియా నుంచి మూడు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాయి. Nokia C21 2nd Edition, Nokia C21, Nokia C21 Plus లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ల స్పెసిఫికేషన్లు, ధర ఎలా ఉన్నాయో చూడండి.

Samayam Telugu 28 Feb 2022, 12:25 pm
ప్రముఖ మొబైల్‌ బ్రాండ్ నోకియా (Nokia) నుంచి మరో మూడు స్మార్ట్‌ఫోన్‌లు విడుదలయ్యాయి. నోకియా సీ2 సెకండ్ ఎడిషన్ (Nokia C21 2nd Edition), నోకియా సీ21 (Nokia C21), నోకియా సీ21 ప్లస్ (Nokia C21 Plus) పేరుతో మూడు ఫోన్లను లాంచ్ చేసింది హెచ్ఎండీ గ్లోబల్. ఫీచర్ ఫోన్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ కావాలనుకుంటున్న వారిని దృష్టి ఉంచుకొని ఈ బడ్జెట్ మొబైళ్లను తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం యూరప్‌లో విడుదలైన ఈ మొబైళ్లు.. త్వరలో భారత్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. Nokia C21 2nd Edition, Nokia C21, Nokia C21 Plus మొబైళ్ల స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇవే.
Samayam Telugu బడ్జెట్ రేంజ్‌లో నోకియా నుంచి మూడు ఫోన్లు విడుదల  (Photo Credit: HMD Global)
Nokia C2 2nd Edition Nokia C21 Nokia C21 Plus launched


నోకియా సీ2 2వ ఎడిషన్, నోకియా సీ21, నోకియా సీ21 ప్లస్ ధరలు
Nokia C21 2nd Edition ప్రారంభ ధర 79 యూరోలు (సుమారు రూ.6,700)గా ఉంది. Nokia C21 ప్రారంభ ధర 99 యూరోలు (దాదాపు రూ.8,400)గా ఉంది. అలాగే Nokia C 21 Plus 119 యూరోల (సుమారు రూ.10,100) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఈ ఫోన్ల అమ్మకాలు మార్చి చివర లేదా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మొబైళ్లను భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేది ఇంకా హెచ్‌ఎండీ ప్రకటించలేదు.

Nokia C2 2nd Edition స్పెసిఫికేషన్లు
5.7 ఇంచుల FWVGA డిస్‌ప్లేతో నోకియా సీ2 2వ ఎడిషన్ వస్తోంది. అక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో ఈ మొబైల్‌ నడుస్తుంది 1జీబీ, 2జీబీ ర్యామ్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్‌ వెనుక 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక గరిష్ఠంగా 32జీబీ స్టోరేజ్ ఉండనుండగా.. మైక్రోఎస్డీ కార్డు కోసం ప్రత్యేక స్లాట్ ఉంటుంది. 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, వైర్‌లెస్‌ ఎఫ్ఎం రేడియో, ఓటీజీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి.
Nokia C2 2nd Edition మొబైల్‌లో 2,400ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్‌ 11 గో (Android 11 Go Edition) ఓఎస్‌పై ఈ ఫోన్‌ నడుస్తుంది.

Nokia C21 స్పెసిఫికేషన్లు
నోకియా సీ21 మొబైల్‌ 6.51 ఇంచుల హెచ్‌డీ+ డిస్‌ప్లే కలిగి ఉంది. అక్టాకోర్ యునిసోక్ ఎస్‌సీ9863ఏ (Unisoc SC9863A) ప్రాసెసర్‌తో ఈ మొబైల్‌ నడుస్తుంది. 2జీబీ, 3జీబీ ర్యామ్ వేరియంట్లలో ఈ ఫోన్‌ అందుబాటులోకి వస్తుంది. ఇక Nokia C21 మొబైల్‌ వెనుక 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫిక్స్ ఫోకస్ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఇక 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
Nokia C21 గరిష్ఠంగా 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. ఇక స్టోరేజ్ పెంచుకునేందుకు మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ ఉంటుంది. 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, ఓటీజీ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 3000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. వెనుక వైపున ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.

Nokia C21 Plus స్పెసిఫికేషన్లు
6.51 ఇంచుల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో నోకియా సీ 21 ప్లస్ మొబైల్‌ వస్తోంది. ఈ ఫోన్‌లో కూడా అక్టాకోర్ యునిసోక్ ఎస్‌సీ9863ఏ (Unisoc SC9863A) ప్రాసెసర్ ఉంటుంది. 2జీబీ, 3జీబీ, 4జీబీ ర్యామ్ ఆప్షన్లలో ఈ మొబైల్‌ అందుబాటుకి రానుంది.Nokia C21 Plus వెనుక రెండు కెమెరాల సెటప్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇక 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది.

32జీబీ, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో నోకియా సీ21 ప్లస్ లభ్యం కానుంది. మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ ఉంటుంది. 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఓటీజీకి సపోర్టు చేసే మైక్రో యూఎస్‌బీ పోర్టు, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీ ఆప్షన్లుగా ఉన్నాయి. Nokia C21 Plus మొబైల్‌లో 4000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వెనుక భాగంలో ఉంది.
కాగా ఈ మూడు మొబైళ్లు ఆండ్రాయిడ్‌ 11 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.