యాప్నగరం

Poco F4 5G : పోకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ ఖరారు - స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ సహా అదిరిపోయే స్పెసిఫికేషన్లతో..

Poco F4 5G Launch date in India : పోకో ఎఫ్4 5జీ లాంచ్‌కు డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 23వ తేదీన భారత్‌లో ఈ మొబైల్‌ అడుగుపెట్టనుంది. మిడ్ రేంజ్‌లో మంచి స్పెసిఫికేషన్లతో రానుంది. పూర్తి వివరాలు ఇవే.

Authored byKrishna Prakash | Samayam Telugu 17 Jun 2022, 4:02 pm
Poco F4 5G : పోకో ఎఫ్4 5జీ ఇండియా లాంచ్‌కు తేదీ ఖరారైంది. మిడ్ రేంజ్‌లో స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో ఈ మొబైల్‌ ఈనెల 23న భారత్‌లో అడుగుపెట్టనుంది. గ్లోబల్‌గానూ ఇదే రోజు విడుదల కానుంది. ఈ విషయాన్ని పోకో ఇండియా అధికారికంగా ప్రకటించింది. కొద్దిరోజులుగా ఈ మొబైల్‌ గురించి టీజ్ చేస్తూ వచ్చిన పోకో (Poco).. ఇప్పుడు ట్విట్టర్ ద్వారా అఫీషియల్‌గా డేట్‌ను ప్రకటించింది.
Samayam Telugu Poco F4 5G : పోకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల తేదీ ఖరారు (Photo: Poco)
Poco F4 5G India launch date


పోకో ఎఫ్‌4 5జీని గ్లోబల్‌గా జూన్ 23వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) లాంచ్ చేయనున్నట్టు పోకో వెల్లడించింది. ఇదే సమయానికి ఇండియాలో కూడా విడుదల కానుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. లాంచ్ వివరాలను వెల్లడించిన ఫొటోలోనే ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) లోగోను కూడా Poco పొందుపరిచింది. కాగా, లాంచ్‌కు ముందే పోకో ఎఫ్4 5జీకి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి. ధర అంచనాలు కూడా వెల్లడయ్యాయి.

Poco F4 5G Expected Price | చైనాలో ఈ సంవత్సరం మొదట్లో విడుదలైన రెడ్‌మీ కే40ఎస్‌నే రీబ్రాండెండ్‌ వెర్షన్‌గా పోకో ఎఫ్4 5జీ పేరుతో పోకో తీసుకొస్తోందని తెలుస్తోంది. రెడ్‌మీ కే40ఎస్ ప్రారంభ ధర చైనాలో 1,799 యువాన్లు (సుమారు రూ.21,530)గా ఉంది. భారత్‌లో పోకో ఎఫ్4 5జీ ప్రారంభ ధర రూ.27వేలలోపు ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.

పోకో ఎఫ్4 5జీ స్పెసిఫికేషన్లు
Poco F4 5G Specifications | లాంచ్‌కు ముందే పోకో ఎఫ్4 5జీకి సంబంధించిన చాలా స్పెసిఫికేషన్లు బయటికి వచ్చాయి. స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ ఈ మొబైల్‌లో ఉండనుంది. 4,500mAh బ్యాటరీ, 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌తో రానున్నట్టు తెలుస్తోంది.
HDR10+ విజన్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉండే ఫుల్ హెచ్‌డీ+ E4 AMOLED డిస్‌ప్లేను పోకో ఎఫ్4 5జీ కలిగి ఉంటుంది. డిస్‌ప్లే సైజ్ 6.67 ఇంచులుగా ఉండొచ్చు. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉండొచ్చు. డ్యుయల్ స్టీరియో స్పీకర్ల సెటప్ ఉండనుంది.

Poco F4 5G వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉండే 64మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉండొచ్చు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో Poco ఈ ఫోన్‌ను తీసుకొస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.