యాప్నగరం

50MP కెమెరాతో రానున్న రియల్‌మీ బడ్జెట్ ఫోన్‌ - విడుదల తేదీ ఖరారు - పూర్తి వివరాలు ఇవే | Realme C35

Realme C35 India release Date : రియల్‌మీ సీ35 మొబైల్‌ భారత్‌లో బడ్జెట్ రేంజ్‌లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్‌ రిలీజ్ డేట్‌ను రియల్‌మీ ఖరారు చేసింది. స్పెసిఫికేషన్లు, పూర్తి వివరాలు చూడండి.

Samayam Telugu 5 Mar 2022, 5:58 pm
రియల్‌మీ (Realme) నుంచి భారత మార్కెట్‌లోకి మరో బడ్జెట్ మొబైల్‌ రానుంది. రియల్‌మీ సీ35 (Realme C35) మొబైల్‌ను లాంచ్ చేసేందుకు చైనీస్ మొబైల్‌ తయారీ సంస్థ Realme సిద్ధమైంది. మార్చి 7వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ మొబైల్‌ను విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది.. 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో కూడిన వెనుక మూడు కెమెరాల సెటప్, ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో రియల్‌మీ సీ35 రానుంది.
Samayam Telugu 50MP కెమెరాతో రానున్న రియల్‌మీ బడ్జెట్ ఫోన్‌ - విడుదల తేదీ ఖరారు (Photo: Realme)
Realme C35 launch

రియల్‌మీ సీ35 ధర
Realme C35 Price | రియల్‌మీ సీ35 మొబైల్‌ గతంలోనే థాయ్‌లాండ్‌లో లాంచ్ అయింది. అక్కడ ఈ మొబైల్‌ ప్రారంభ ధర 5,799 థాయ్ బాట్స్‌ (సుమారు రూ.13,350)గా ఉంది. అయితే భారత్‌లో ఈ మొబైల్‌ ప్రారంభ ధర రూ.10వేలలోపు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Also Read: రూ.6,599కే 5000mAh బ్యాటరీ, హెచ్‌డీ+ డిస్‌ప్లేతో లాంచ్ అయిన Lava X2 మొబైల్ - స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే
రియల్‌మీ సీ35 స్పెసిఫికేషన్లు
Realme C35 Specifications | థాయ్‌లాండ్‌లో లాంచ్ అయిన స్పెసిఫికేషన్లతో రియల్‌మీ సీ35 భారత్‌లోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో ఈ మొబైల్‌ రానుంది. 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. ఇక ఫోన్‌ బ్యాటరీ లైఫ్ మరింత పొడిగించుకునేందుకు ఉపయోగపడేలా సూపర్ పవర్ సేవింగ్ మోడ్ ఫీచర్‌ను ఈ మొబైల్‌లో పొందుపరిచినట్టు Realme పేర్కొంది. Realme C35లో అక్టాకోర్ యునిసోక్ టీ616 (Unisoc T616) ప్రాసెసర్‌ ఉండే అవకాశం ఉంది.
Also Read: రూ.7,499కే 6GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో కొత్త మొబైల్‌ విడుదల - స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే? | Tecno spark 8C
రియల్‌మీ సీ35 (Realme C35) వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఉంటుంది. ఇక మాక్రో సెన్సార్, ప్రొట్రయిట్‌గా మిగిలిన రెండు కెమెరాలు ఉంటాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. Realme C35 ఫోన్‌ 5000ఎంఏహెచ్ బ్యాటరీతో రానుండగా.. 18వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉండనుంది. ఈ ఫోన్‌ గరిష్ఠంగా 128జీబీ స్టోరేజ్‌తో వచ్చే అవకాశం ఉంది. అలాగే స్టోరేజ్‌ను పొడిగించుకునేందుకు మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్ కూడా ఈ ఫోన్‌లో ఉంటుంది.
Also Read: రూ.6000 లోపు ధర, 4000mAh బ్యాటరీతో ఐటెల్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల.. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే | Itel A27
మరోవైపు రియల్‌మీ 9 సిరీస్‌ మార్చి 10న భారత్‌లో లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో రియల్‌మీ 9 5జీ, రియల్‌మీ 9 5జీ ఎస్ఈ మొబైళ్లు విడుదల కానున్నాయి. Also Read: Realme 9 Series : రియల్‌మీ నుంచి మరో రెండు 5జీ మొబైళ్లు.. విడుదల తేదీ ఇదే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.