యాప్నగరం

Samsung : 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో సామ్‌సంగ్‌ Galaxy M13 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్

Samsung Galaxy M13 Smartphone launched : సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 పేరుతో మరో బడ్జెట్ ఫోన్‌ లాంచ్ అయింది. 5000mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో ఈ మొబైల్‌ వస్తోంది.

Authored byKrishna Prakash | Samayam Telugu 28 May 2022, 8:53 am
Samsung Galaxy M13 launch : ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ సామ్‌సంగ్‌ (Samsung) కొత్తగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 (Samsung Galaxy M13)ను లాంచ్ చేసింది. సామ్‌సంగ్‌ వెబ్‌సైట్‌లో ఇప్పటికే ఈ ఫోన్‌ లిస్టయింది. గత సంవత్సరం రిలీజై పాపులర్ అయిన గెలాక్సీ ఎం12కు ఇది సక్సెసర్‌గా వచ్చింది. 5000mAh బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఫుల్ హెచ్‌డీ+ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లేతో సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 వస్తోంది. అలాగే వెనుక మూడు కెెమెరాలు ఉండగా.. ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఉంది. ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత వన్ యూఐ కోర్ 4.1 ఓఎస్‌తో Samsung Galaxy M13 వస్తోంది.
Samayam Telugu సామ్‌సంగ్‌ Galaxy M13 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ (Photo: Samsung)
Samsung Galaxy M13 launch specs price


సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 స్పెసిఫికేషన్లు
Samsung Galaxy M13 Specifications | 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ ఇన్ఫినిటీ వీ LCD డిస్‌ప్లేను ఈ మొబైల్‌ కలిగి ఉంది. ఆక్టాకోర్ ఎగ్జినోస్ 850 (Samsung Exynos 850) ప్రాసెసర్‌ ఈ ఫోన్‌లో ఉంటుంది. 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. స్టోరేజ్‌ను పొడిగించుకునేందుకు మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్‌ను సామ్‌సంగ్‌ పొందుపరిచింది. ఆండ్రాయిడ్‌ 12తో కూడిన OneUI Core 4.1పై ఈ ఫోన్‌ రన్ అవుతుంది.

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 ఫోన్‌ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను సామ్‌సంగ్‌ ఇస్తోంది. 4జీ, ఎల్‌టీఈ, వైఫై 5, బ్లూటూత్ 5, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 మొబైల్‌ 5000mAh బ్యాటరీతో వస్తోంది. 15వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే సామ్‌సంగ్‌ Knox సెక్యూరిటీ ఉంటుంది.

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 ధర
Samsung Galaxy M13 Price | గెలాక్సీ ఎం13 మొబైల్‌ను అధికారికంగా లాంచ్ చేసిన సామ్‌సంగ్‌ ధర వివరాలను మాత్రం వెల్లడించలేదు. అతిత్వరలో ధరను ప్రకటించనుంది. అయితే భారత్‌లో ఈ మొబైల్‌ ప్రారంభ ధర రూ.10,499గా ఉంటుందని అంచనా. డీప్ గ్రీన్, లైట్ బ్లూ, ఆరెంజ్ కాపర్ కలర్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ముందుగా యూరప్‌లో ఈ ఫోన్‌ లభ్యమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత భారత్‌లో సేల్‌కు వస్తుంది.

ప్రస్తుతం ఈ సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 ఫోన్ 4జీతో వస్తుండగా.. 5జీ మోడల్‌ను కూడా లాంచ్ చేయాలని సామ్‌సంగ్‌ ప్లాన్‌ చేస్తోంది. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.