యాప్నగరం

Samsung Galaxy: 'గెలాక్సీ నోట్ 9' లిమిటెడ్ వేరియంట్ సేల్ షురూ

హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో ఈ ఫోన్లను కొనుగోలు చేస్తే రూ.3వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఇస్తారు.

Samayam Telugu 10 Dec 2018, 3:00 pm
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన 'గెలాక్సీ నోట్ 9' స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి లిమిటెడ్ ఎడిషన్ కలర్ వేరియెంట్‌ను భారత మార్కెట్‌లోకి తాజాగా విడుదల చేసింది. ఆల్పయిన్ వైట్ కలర్ వేరియెంట్‌లో గెలాక్సీ నోట్ 9ను, పొలారిస్ బ్లూ వేరియంట్‌లో గెలాక్సీ ఎస్9 ప్లస్‌ను శాంసంగ్ విడుదల చేసింది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని శాంసంగ్ ఈ కొత్త ప్రత్యేక మోడల్ ఫోన్లను తీసుకొచ్చింది.
Samayam Telugu Samsung


ఇక ఈ ఫోన్ల ధరల విషయానికొస్తే.. గెలాక్సీ నోట్ 9 ఆల్పయిన్ వైట్ ఎడిషన్ 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ ధర రూ.67,900 ఉండగా, గెలాక్సీ ఎస్9 ప్లస్ పొలారిస్ బ్లూ వేరియెంట్ (64జీబీ) ధర రూ.64,900గా ఉంది.

సోమవారం (డిసెంబరు 10) నుంచి ఈ ఫోన్లు ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో ఈ ఫోన్లను కొనుగోలు చేస్తే రూ.3వేల ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఇస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.