యాప్నగరం

Airtel 5G Plus : హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్‌ 5జీ అందుబాటులోకి వచ్చేసింది.. ప్లాన్స్ పరిస్థితేంటి..?

Airtel 5G Plus: ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్ నెట్‌వర్క్ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. దేశంలో మరో 7 నగరాల్లోనూ యూజర్లకు 5జీ సర్వీస్‌లు అందుతున్నాయి. సపోర్ట్ చేస్తున్న డివైజ్‌లు, ప్లాన్స్ వివరాలు ఇవే.

Authored byKrishna Prakash | Samayam Telugu 11 Oct 2022, 5:18 pm
Airtel 5G Plus in Hyderabad: హైదరాబాద్ నగరానికి 5జీ నెట్‌వర్క్ వచ్చేసింది. ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్ (Airtel) తొలి దశలో హైదరాబాాద్‌లోనూ 5జీ సర్వీస్‌లను లాంచ్ చేసింది. హైదరాబాద్ సహా దేశంలోని 8 నగరాల్లో 5జీని అందుబాటులోకి తెస్తున్నట్టు ఈనెల 1వ తేదీన ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఇప్పుడు హైదరాబాద్‌లోని యూజర్లకు 5జీ ప్లస్ (Airtel 5G Plus) నెట్‌వర్క్ అందుతోంది. 5జీకి సపోర్ట్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్స్‌ వాడుతున్న వారికి 5జీ సింబల్ చూపిస్తోంది. మరి ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్ ఏఏ నగరాల్లో మొదలైంది.. ప్లాన్స్ పరిస్థితి ఏంటో చూడండి.
Samayam Telugu Airtel 5G Plus goes live in Hyderabad
ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ (Photo: Airtel)


హైదరాబాద్‌తో పాటు ఈ సిటీస్‌లోనూ..
తొలి దశలో దేశంలోని 8 నగరాల్లో 5జీ ప్లస్ సర్వీస్‌లను ఎయిర్‌టెల్‌ అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, సిలిగుడి, నాగ్‌పూర్, వారణాసిలో Airtel 5G Plusను లాంచ్ చేసింది. త్వరలోనే మరిన్ని నగరాలకు కూడా విస్తరించనుంది. మార్చి 2023 కల్లా దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెస్తామని ఎయిర్‌టెల్‌ ఇప్పటికే వెల్లడించింది.

ఏ డివైజ్‌లు సపోర్ట్ చేస్తాయి?
ప్రస్తుతం ఎంపిక చేసిన 5జీ స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్.. ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్‌కు సపోర్ట్ చేస్తున్నాయి. సపోర్ట్ లేని 5జీ ఫోన్‌లకు మొబైల్‌ తయారీ సంస్థలు అప్‌డేట్‌ను అతిత్వరలో తీసుకొస్తాయి. OTA అప్‌డేట్‌ చేసుకున్న తర్వాత ఆ స్మార్ట్‌ఫోన్‌లలోనూ ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్ చూపిస్తుంది. ఇప్పటికే ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్‌కు సపోర్ట్ చేస్తున్న డివైజ్‌ల్లో నెట్‌వర్క్ సిగ్నల్ ఇండికేటర్ దగ్గర 5జీ అని చూపిస్తోంది.

ప్లాన్స్ సంగతేంటి..?
5జీ అందుబాటులోకి వచ్చినా కూడా.. ప్రస్తుతం వాడుతున్న 4జీ ప్లాన్ వినియోగించుకోవచ్చు. ఇప్పటికే వాడుతున్న ప్లాన్‌.. 5జీకి కూడా వర్తిస్తుంది. ప్రస్తుతానికైతే 5జీ కోసం ప్రత్యేకంగా వేరే ప్లాన్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఇక ఎయిర్‌టెల్‌ 5జీ కోసం వేరే సిమ్ కూడా అక్కర్లేదు. ప్రస్తుతం వాడుతున్న 4జీ సిమ్.. 5జీ నెట్‌వర్క్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
మరోవైపు రిలయన్స్ జియో.. దేశంలోని 4 నగరాల్లో బీటా టెస్టింగ్ కోసం 5జీ నెట్‌వర్క్‌ను తీసుకొచ్చింది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, వారణాసి నగరాల్లోని యూజర్లకు 5జీని అందుబాటులోకి తెచ్చింది. టెస్టింగ్ పూర్తయ్యాక మరిన్ని నగరాల్లోనూ 5జీని లాంచ్ చేయనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.