యాప్నగరం

Ambrane Wise Roam : బడ్జెట్ ధరకే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో ఆంబ్రేన్ స్మార్ట్‌వాచ్ లాంచ్

Ambrane Wise Roam Smartwatch : ఆంబ్రేన్ వైస్ రోమ్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ విడుదలైంది. సేల్ కూడా మొదలైంది. బడ్జెట్ రేంజ్‌లో బ్లూటూత్ కాలింగ్, మంచి డిస్‌ప్లేతో పాటు ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ఈ వాచ్ కలిగి ఉంది.

Authored byKrishna Prakash | Samayam Telugu 21 Jun 2022, 7:50 am
దేశీయ కంపెనీ ఆంబ్రేన్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. తక్కువ ధర రేంజ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో ఆంబ్రేన్ వైస్ రోమ్ (Ambrane Wise Roam) స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్‌లోకి వచ్చింది. హెచ్‌డీ ల్యూసిడ్ డిస్‌ప్లే, 2.5D కర్వ్‌డ్ గ్లాస్ ఆకర్షణీయంగా ఉంది. 100కుపైగా క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది. ప్రధానమైన హెల్త్ ఫీచర్లు, 60కు పైగా స్పోర్ట్ మోడ్స్‌కు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. Ambrane Wise Roam స్మార్ట్‌వాచ్ పూర్తి ఫీచర్లు, ధర వివరాలు ఇవే.
Samayam Telugu Ambrane Wise Roam Smartwatch


Ambrane Wise Roam స్మార్ట్‌వాచ్ ధర
ఆంబ్రేన్ వైస్ రోమ్ స్మార్ట్‌వాచ్.. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,799కు సేల్‌కు వచ్చింది. అయితే ఇది ఇంట్రడక్టరీ ధర అని ఆంబ్రేన్ పేర్కొంది. ఈ పరిమిత ఇంట్రడక్టరీ ఆఫర్ ముగిశాక ఈ వాచ్ ధర రూ.2,499గా ఉండొచ్చు. జేడ్ బ్లాక్, స్టోన్ గ్రే, ఫెర్న్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో ఈ వాచ్ లభిస్తోంది.

Ambrane Wise Roam స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
1.28 ఇంచుల సర్క్యులర్ ల్యూసిడ్ డిస్‌ప్లేతో అంబ్రేన్ వైస్ రోమ్ స్మార్ట్‌వాచ్ వస్తోంది. డిస్‌ప్లేపై 2.5D కర్వ్‌డ్ గ్లాస్ ఉంటుంది. డిస్‌ప్లే పీక్ బ్రైట్‌నెస్ 450 నిట్‌గా ఉంది. బ్రైట్‌నెస్, వైబ్రేషన్ తక్కువగా చేసేలా థియేటర్ మోడ్‌ సపోర్ట్ కూడా ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ కోసం ఇన్‌బుల్ట్‌గా మైక్, స్పీకర్ ఉంటాయి. బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయినప్పుడు వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. కాల్స్ చేయవచ్చు.

నిరంతర హార్ట్‌రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ కొలిచే SpO2, నిద్రను విశ్లేషించే స్లీప్ ట్రాకర్ హెల్త్ ఫీచర్లు Ambrane Wise Roam స్మార్ట్‌వాచ్‌లో ఉన్నాయి. బ్రీత్ ట్రైనింగ్, హై ఏఆర్ అలెర్ట్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. 60కు పైగా స్పోర్ట్స్ మోడ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్స్‌లో డా ఫిట్ (Da Fit) యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని ఈ వాచ్‌ను సింక్ చేసుకోవచ్చు. గూగుల్ ఫిట్, యాపిల్ హెల్త్ యాప్స్‌కు కూడా కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉంది.

Ambrane Wise Roam వాచ్‌లో 260mAh బ్యాటరీ ఉంటుంది. 2 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుందని ఆంబ్రేన్ పేర్కొంది.10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని ఆంబ్రేన్ చెబుతోంది.
స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయినప్పుడు కాల్స్‌తో పాటు ఎస్ఎంఎస్, సోషల్ మీడియా నోటిఫికేషన్లు వస్తే వాచ్‌లో అలెర్ట్‌లు పొందవచ్చు. మ్యూజిక్‌ను, రిమోట్ కెమెరా షటర్‌ను కంట్రోల్ చేయవచ్చు. అలారమ్, స్టాప్ వాచ్, ఫైండ్ ఫోన్, రెండు ఇన్‌బుల్ట్ గేమ్స్ Ambrane Wise Roam వాచ్‌లో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.