యాప్నగరం

iPhone : ఐఫోన్ కెమెరా సీక్రెట్ ఇదే.. తొలిసారి వెల్ల‌డించిన యాపిల్ సీఈఓ టిమ్‌ కుక్‌

Tim Cook Reveals Apples biggest secret : ఐఫోన్ కెమెరాల‌తో తీసిన ఫొటోలు స్ట‌న్నింగ్‌గా ఉండ‌టమే కాకుండా మ‌రే స్మార్ట్‌ఫోన్‌తోనూ ఈ క్వాలిటీ క‌నిపించ‌ద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 15 Dec 2022, 12:36 pm
Apple CEO Tim Cook reveals a big secret about iPhone cameras : ఐఫోన్‌ కెమెరా సీక్రెట్‌ను యాపిల్ సీఈఓ టిమ్‌ కుక్‌ (Tim Cook) వెల్లడించారు. ఐఫోన్ కెమెరాల‌తో తీసిన ఫొటోలు స్ట‌న్నింగ్‌గా ఉండ‌టమే కాకుండా మ‌రే స్మార్ట్‌ఫోన్‌తోనూ ఈ క్వాలిటీ క‌నిపించ‌ద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఐఫోన్ కెమెరాల‌ను యాపిల్ త‌యారుచేయ‌ద‌ని.. సోనీ నుంచి సెన్సర్ల‌ను పొందుతుంద‌ని మ‌న‌లో చాలామందికి తెలియ‌దు. అండ్రాయిడ్ ఫోన్ త‌యారీదారుల‌కు సోనీ కెమెరాల‌ను స‌రఫరా చేస్తుంది. ఐఫోన్ల‌కు కూడా సోనీ కెమెరాల‌ను త‌యారుచేస్తుంద‌ని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తొలిసారి ట్వీట్‌ చేశారు.
Samayam Telugu Apple CEO Tim Cook


టిమ్ కుక్ (Tim Cook) ప్ర‌స్తుతం జ‌పాన్‌లో స‌ర‌ఫ‌రాదారుల టూర్‌లో బిజీగా ఉన్నారు. ఐఫోన్ కోసం అత్యున్న‌త ప్ర‌పంచ‌శ్రేణి కెమెరా సెన్స‌ర్ల కోసం తాము ద‌శాబ్ధ‌కాలంగా సోనీతో చేతులు క‌లిపామ‌ని కుక్ ట్వీట్ చేశారు. కుక్ ఇటీవ‌ల కుమ‌మొటో లోని సోనీ ఫెసిలిటీని సంద‌ర్శించారు. ఐఫోన్ మోడ‌ల్స్‌లో వాడే హార్డ్‌వేర్ గురించి యాపిల్ ఎన్న‌డూ పెద్ద‌గా వివ‌రాలు వెల్ల‌డించ‌ని క్ర‌మంలో ఐఫోన్‌లో వాడే సెన్స‌ర్ల‌కు సంబంధించి కుక్ తాజా ట్వీట్ ప్రాధాన్య‌త సంతరించుకుంది. యాపిల్ కెమెరాల కోసం సోనీ హార్డ్‌వేర్ వాడుతుంద‌ని గ‌తంలో వార్త‌లు రాగా తొలిసారిగా కంపెనీ ఈ స‌మాచారాన్ని నిర్ధారించ‌డం గ‌మ‌నార్హం. త‌మ భాగ‌స్వామ్యం నిరంత‌రం కొన‌సాగుతుంద‌ని సోనీ ఫెసిలిటీని సంద‌ర్శించిన క్ర‌మంలో కుక్ పేర్కొన‌డంతో రాబోయే ఐఫోన్ మోడ‌ల్స్ కూడా సోనీ కెమెరా సెన్స‌ర్ల‌తో క‌స్ట‌మ‌ర్ల ముందుకు రానున్నాయి.

Apple iOS 16 2 released with 5G update in India : భారత్‍లో యాపిల్ ఐఫోన్‍లకు 5G సపోర్ట్ వచ్చేసింది. 5G ని ఎనేబుల్ చేసే అధికారిక అప్‍డేట్‍ను యాపిల్ విడుదల చేసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో 5G టెలికాం సేవలు (5G Services) అందుబాటులోకి వచ్చాయి. దీంతో 5జీ ఫోన్లు కలిగిన ఆండ్రాయిడ్‌ వినియోగదారులు ఇప్పటికే వేగవంతమైన డేటా సేవలను ఆనందిస్తున్నారు. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలైన శాంసంగ్‌, వన్‌ప్లస్‌, ఒప్పో, షావోమీ.. తమ వినియోగదారులకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను అందించాయి.

అయితే.. 5G స్మార్ట్‌ఫోన్‌, నెట్‌వర్క్‌ రెండూ అందుబాటులో ఉన్నా.. ఐఫోన్‌ (iPhone) యూజర్లు మాత్రం ఈ సేవలకు దూరంగా ఉన్నారు. సంబంధిత అప్‌డేట్‌ యాపిల్‌ (Apple) ఇవ్వకపోవడమే దీనికి కారణం. దీంతో అప్‌డేట్‌ కోసం ఐఫోన్‌ యూజర్లు కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి నిరీక్షణకు తెరదించుతూ యాపిల్‌ కంపెనీ తాజాగా భారత ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. 5Gతో కూడిన ఐఓఎస్‌ అప్‌డేట్‌ను విడుదల చేసింది.

iPhone 5G Update: ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. 5G అప్‌డేట్‌ వచ్చేసింది.. మీ ఫోన్‌లో ఇలా యాక్టివేట్‌ చేసుకోండి
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.