యాప్నగరం

Apple iPhone 14 : భారత్‌లో ఐఫోన్ 14 తయారీ ప్రారంభం.. ధర తగ్గుతుందా?

iPhone 14 - made in India : భారత్‌లో ఐఫోన్ 14 ఉత్పత్తి ప్రారంభమైంది. లాంచ్ అయిన నెలరోజుల లోపే ఇండియాలో ఈ మోడల్ తయారీ మొదలైంది. దేశీయంగా తయారీ చేస్తుండడంతో ప్రభుత్వం నుంచి పీఎల్ఐ స్కీమ్ ద్వారా యాపిల్ రాయితీలు పొందనుంది. మరి ఐఫోన్ 14 ధర తగ్గే అవకాశం ఉందా? వివరాలు ఇవే.

Authored byKrishna Prakash | Samayam Telugu 28 Sep 2022, 12:27 pm
యాపిల్ (Apple) నుంచి లేటెస్ట్‌గా వచ్చిన ఐఫోన్ 14 (iPhone 14) తయారీ ఇండియాలో మొదలైంది. అనుకున్న దాని కంటే ముందుగానే భారత్‌లో ఈ మోడల్ ఉత్పత్తిని యాపిల్ (Apple) షురూ చేసింది. చెన్నై సమీపంలో ఉన్న ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఐఫోన్ 14 మానుఫ్యాక్చరింగ్ మొదలైంది. గత సంవత్సరం ఐఫోన్ 13 విడుదలైన తర్వాత చాలా నెలలకు ఇండియాలో ఈ మోడల్ తయారీ షురూ అయింది. అయితే ఐఫోన్ 14 మాత్రం లాంచ్ అయి నెలల కాకముందే ఇండియాలో ఉత్పిత్తి అవుతోంది. అంటే మరికొన్ని రోజుల్లోనే మేడిన్ ఇండియా ఐఫోన్ 14 (Made in India iPhone 14) కస్టమర్ల చేతుల్లోకి రానుంది.
Samayam Telugu iPhone 14 made in India
భారత్‌లో ఐఫోన్ 14 తయారీ (Photo: Apple)


ఐఫోన్‌ల తయారీని 2017లో ఇండియాలో మొదలుపెట్టింది యాపిల్. ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 12, ఐఫోన్ 13 ఫోన్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పుడు ఐఫోన్ 14 కూడా ఆ జాబితాకు యాడ్ అయింది. ఫాక్స్‌కాన్, విస్ట్రోన్, పెగాట్రాన్ సంస్థల భాగస్వామ్యంతో ఇండియాలో ఐఫోన్‌లను ఉత్పత్తి చేస్తోంది యాపిల్. ప్రస్తుతం చెన్నై శివారుల్లో ఉన్న ఫాక్స్‌కాన్ (Foxconn) ప్లాంట్‌లో ఐఫోన్ 14 అసెంబులింగ్ మొదలైంది. “భారత్‌లో ఐఫోన్ 14ను మ్యానుఫాక్చర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమైన కొత్త టెక్నాలజీలు, సెఫ్టీ సామర్థ్యాలతో ఈ సిరీస్‌ను తీసుకొచ్చాం” అని యాపిల్ పేర్కొంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ ఓపెన్ సేల్ మొదలు

ఈనెల 7వ తేదీనే ఐఫోన్ 14 సిరీస్‌ (iPhone 14 Series) ను లాంచ్ చేసింది యాపిల్. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మ్యాక్స్ మొబైల్స్ వచ్చాయి. ఇప్పటికే సేల్స్ కూడా మొదలయ్యాయి. ఇప్పుడు భారత్‌లో తయారీ కూడా మొదలైంది. లోకల్‌గా ఐఫోన్‌ల ఉత్పత్తి జరుగుతుండడంతో పీఎల్ఐ స్కీమ్ కింద యాపిల్‌కు రాయితీ లభిస్తుంది. దిగుమతి సుంకంపై 20శాతం ఆ సంస్థకు సేవ్ అవుతుంది. మరి ఇండియాలో ఐఫోన్ 14 ధరలు తగ్గే అవకాశం ఉందా? అంటే..

iPhone 14 ధర తగ్గుతుందా.. లేదా?
ఇండియాలో ఉత్పత్తి ప్రారంభమైనా ఐఫోన్ 14 ధరలు ఇప్పటికిప్పుడు తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో ఐఫోన్ 13, ఐఫోన్ 12 తయారీ ఇక్కడే ప్రారంభమైనా యాపిల్ వెంటనే ధరలు తగ్గించలేదు. చాలా నెలల తర్వాత, కొత్త సిరీస్ లాంచ్ అయ్యే ముందు ధరలో కోత విధించింది. ఇప్పుడు కూడా ఇదే వ్యూహాన్ని యాపిల్ అమలు చేసే అవకాశం ఉంది. పీఎల్ఐ స్కీమ్ కింద రాయితీ లభించినా కొన్ని నెలల వరకు ఐఫోన్ 14 లాంచ్ ధరలనే యాపిల్ కొనసాగించే అవకాశం ఉంది. ఆరు నెలల తర్వాత ధరపై ప్రభావం ఉండొచ్చు. ఐఫోన్ 14 128జీబీ ధర ప్రస్తుతం రూ.79,900గా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.