తైవాన్ దేశానికి చెందిన ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి సంస్థ 'అసుస్' భారత మార్కెట్లోకి మూడు కొత్త రకం ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. 'జెన్‌బుక్' సిరీస్‌లో.. జెన్‌బుక్ 13, 14, 15 మోడల్స్‌లో ఈ ల్యాప్‌టాప్‌లు విడుదలయ్యాయి. ఈ ల్యాప్ ధరలు చూస్తే.. జెన్‌బుక్ 13 ప్రారంభ ధర రూ.71,990 ఉండగా, జెన్‌బుక్ 14 ప్రారంభ ధర రూ.72,990, జెన్‌బుక్ 15 ప్రారంభ ధర రూ.1,39,990 గా ఉంది. వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా ఈ ల్యాప్‌టాప్‌లు లభ్యంకానున్నాయి. ఇక వీటి ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ల్యాప్‌టాప్‌లలో ఇంటెల్ కోర్ ఐ5/ఐ7 8వ జనరేషన్ ప్రాసెసర్, ఎన్వీడియా జీటీఎక్స్ 1050 మ్యాక్స్-క్యూ గ్రాపిక్స్, 8/16 జీబీ ర్యామ్, 256/512 జీబీ/1 టీబీ ఎస్ఎస్డీ, యూఎస్బీ టైప్ సి, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 3డీ హెచ్డీ వెబ్ కెమెరా, బ్లూటూత్ 5.0, 13 గంటల బ్యాటరీ లైఫ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు
Asus ZenBook కొత్త ల్యాప్‌టాప్‌లు.. ధర తెలిస్తే షాకే!
అసుస్ సంస్థ భారత మార్కెట్లోకి జెన్‌బుక్ 13, 14, 15 మోడల్స్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా ఈ ల్యాప్‌టాప్‌లు లభ్యంకానున్నాయి.
Samayam Telugu 30 Jan 2019, 6:18 pm
ప్రధానాంశాలు:
- జెన్‌బుక్ 13 ప్రారంభ ధర రూ.71,990
- జెన్‌బుక్ 14 ప్రారంభ ధర రూ.72,990
- జెన్‌బుక్ 15 ప్రారంభ ధర రూ.1,39,990