యాప్నగరం

BGMI - Spider-Man: బీజీఎంఐలో స్పైడర్ మ్యాన్..! గేమర్లు, మార్వెల్ అభిమానులకు శుభవార్తే ఇది

బీజీఎం - స్పైడర్ మ్యాన్ భాగస్వామ్యం ఏ విధంగా ఉండనుంది..! గేమ్‌లో ఎలాంటి మార్పులు, కొత్త ఫీచర్లు వచ్చే అవకాశం ఉందో చూడండి. ఇందుకు సంబంధించి చాలా అంచనాలు కూడా వెలువడుతున్నాయి.

Samayam Telugu 17 Dec 2021, 4:31 pm

ప్రధానాంశాలు:

  • త్వరలో స్పైడర్ మ్యాన్‌తో బీజీఎంఐ భాగస్వామ్యం!
  • సంకేతాలు ఇచ్చిన క్రాఫ్టాన్
  • కొత్త కాస్ట్యూమ్స్, మోడ్ సహా మరికొన్ని వచ్చే ఛాన్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu స్పైడర్ మ్యాన్ - బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా భాగస్వామ్యం!
Spider Man - Battlegrounds Mobile India
మార్వెల్ (Marvel) అభిమానులకు, గేమర్లకు అత్యంత సంతోషం కలిగించే విషయమిది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్‌ ఇండియా (Battlegrounds Mobile India - BGMI) గేమ్‌లో త్వరలో స్పైడర్ మ్యాన్ (Spider-Man) కనిపించే అవకాశం ఉంది. ఈ మేరకు మార్వెల్ సూపర్ హీరో స్పైడర్ మ్యాన్‌తో బీజీఎంఐ డెవలపర్ క్రాఫ్టాన్ (Krafton) చేతులు కలపనుంది. అసలు బీజీఎం - స్పైడర్ మ్యాన్ భాగస్వామ్యం ఏ విధంగా ఉండనుంది.. గేమ్‌లో ఎలాంటి మార్పులు, కొత్త ఫీచర్లు వచ్చే అవకాశం ఉందో చూడండి.
డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ (Spider-Man No Way Home) సినిమా సూపర్ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమా అద్భుతంగా ఉందంటూ చూసిన వారంటున్నారు. రివ్యూలు సైతం చాలా సానుకూలంగా వచ్చాయి. స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో ఈ సినిమా అత్యుత్తమమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ తో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు క్రాఫ్టాన్ సిద్ధమైంది.
అంతరిక్షానికి ఫుడ్ డెలివరీ.. ఉబెర్ ఈట్స్ చరిత్ర.. ఎలా, ఏ ఐటెమ్స్ పంపిందో తెలుసా
త్వరలో స్పైడర్ మ్యాన్: నో వే హోమ్‌తో భాగస్వామ్యం మొదలవుతుందనేలా బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్‌ ఇండియా డెవలపర్ క్రాఫ్టాన్ ప్రకటన చేసింది. ఓ సిగ్నేచర్ హెల్మెట్‌ను అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. “బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్‌ ఇండియా కోసం కొత్తగా ఏదో భారీ విషయం రాబోతోంది. వేచిచూడండి!” అని క్యాప్షన్ రాసుకొచ్చింది.
View this post on Instagram A post shared by BATTLEGROUNDS MOBILE INDIA (@battlegroundsmobilein_official)

అయితే స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ తో భాగస్వామ్యం గురించి టీజ్ చేసిన క్రాఫ్టాన్ మిగిలిన విషయాలను వెల్లడించలేదు. అయితే ఈ కలయికతో బీజీఎంఐ (BGMI) గేమ్‌లో స్పైడర్ మ్యాన్ కాస్టూమ్స్ వస్తాయని అంచనా. స్పైడర్ మ్యాన్ దుస్తులను ప్లేయర్లకు రివార్డు అందించే అవకాశం ఉంది. అలాగే స్పైడర్ మ్యాన్ కాస్మోటిక్స్ తో పాటు పరిమిత సమయంలో కొత్త గేమ్‌ మోడ్ కూడా రావొచ్చు. స్పైడర్ మ్యాన్‌కు సంబంధించిన మిగిలిన రివార్డులు కూడా బీజీఐఎంలోకి వచ్చే అవకాశం ఉంది.
వొడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆ సర్వీస్ అందరికీ ఉచితం
మరోవైపు క్రాఫ్టాన్‌కే చెందిన ఇంటర్నేషల్ గేమ్‌ పబ్‌జీ మొబైల్‌ (PUBG Mobile).. స్పైడర్ మ్యాన్‌తో భాగస్వామ్యంపై ప్రకటన చేసింది. రెండు రోజుల క్రితమే అధికారికంగా పోస్టర్ కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ సగ భాగంలో న్యూయార్క్ సిటీలోని స్పైడర్ మ్యాన్ కనిపిస్తే.. మరో సగంలో ఎరాంగిల్ మ్యాప్ లో ప్యారచూట్ లతో దిగుతున్న ప్లేయర్లు కనిపిస్తున్నారు. అలాగే స్వింగ్ ఇన్ టు స్పైడర్ మ్యాన్ జోన్ అని క్రాఫ్టాన్ పేర్కొంది. అంటే పబ్‌జీలో ప్లేయర్లకు స్పైడర్ మ్యాన్‌లా ఊగగలిగే స్వింగింగ్ మెకానిజమ్ తెస్తుందేమో చూడాలి. అదే ఫీచర్ బీజీఎంఐకు కూడా వస్తే యూజర్లకు గేమ్‌ మరింత కొత్త అనుభూతిని ఇస్తుంది.

టీవీ షో లీగ్ ఆఫ్ లెజెండ్స్ (ఆర్కేన్)తో చేతులు కలిపిన బీజీఎంఐ.. 1.7 అప్‌డేట్‌తో ఎరాంగిల్, లివిక్, షాన్ హోక్ మ్యాపుల్లో కొత్త మోడ్ తీసుకొచ్చింది. మిర్రర్ వరల్డ్ పేరుతో ఈ మోడ్ అందుబాటులోకి వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.