యాప్నగరం

Amazon Sale: సామ్‌సంగ్‌ చీపెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఇదే.. కార్డ్ ఆఫర్‌తో మరింత తక్కువకే..

Samsung Galaxy M13 5G offer : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 5జీ స్మార్ట్‌ఫోన్‌పై మంచి ఆఫర్‌ ఉంది. తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా లభిస్తోంది.

Authored byKrishna Prakash | Samayam Telugu 15 Oct 2022, 2:12 pm
ప్రస్తుతం దేశంలో 5జీ ఫీవర్ నడుస్తోంది. 5జీ నెట్‌వర్క్ రోల్అవుట్ మొదలవడంతో 5జీ స్మార్ట్‌ఫోన్‌లు కొనేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ రేంజ్‌లో 5జీ మొబైళ్ల (Budget 5G Mobiles) కోసం చాలా మంది చూస్తున్నారు. తక్కువ ధరలో సామ్‌సంగ్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ (Samsung 5G Phone) కావాలనుకునే వారికి ఓ ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 5జీ (Samsung Galaxy M13 5G). అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ (Amazon Great Indian Festival) సందర్భంగా ఈ మొబైల్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్‌ను ఉపయోగించుకుంటే మరింత తక్కువకే ఈ ఫోన్‌ను దక్కించుకోవచ్చు. అమెజాన్ సేల్‌లో Samsung Galaxy M13 5G ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూడండి.
Samayam Telugu Samsung Galaxy M13 5G offer
సామ్‌సంగ్ గెలాక్సీ ఎం13 5జీ ఆఫర్స్ (Photo: Samsung)


Samsung Galaxy M13 5G ఆఫర్లు
సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 5జీ బేస్ మోడల్ ధర ప్రస్తుత అమెజాన్ సేల్‌లో రూ.11,999గా ఉంది. సాధారణంగా 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ఉండే ఈ ఫోన్‌ ధర రూ.13,999గా ఉంటుంది. ఈ సేల్‌లో తగ్గింపు ధరతో రూ.11,999కే లభిస్తుంది. యాక్సిక్, సిటీ, ఐసీఐసీఐ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డుతో కొంటే అదనంగా రూ.1,200 అదనపు తగ్గింపు పొందవచ్చు. అంటే రూ.10,799కే దక్కించుకోవచ్చు. Samsung Galaxy M13 5G 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ టాప్‌ వేరియంట్‌పై కూడా డిస్కౌంట్, కార్డ్ ఆఫర్లు ఉన్నాయి.
Samsung Galaxy M13 5G స్పెసిఫికేషన్లు
90Hz రిఫ్రెష్ రేట్ ఉండే 6.5 ఇంచుల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 5జీ వస్తోంది. దీనికి గొరిల్లాగ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్‌ రన్ అవుతుంది. 11 5జీ బ్యాండ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 12 బేస్డ్ వన్ యూఐ 4 ఓఎస్‌తో ఈ ఫోన్ వస్తోంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ఉంటుంది.

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 5జీ వెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. 5000mAh బ్యాటరీ ఈ ఫోన్‌లో ఉంటుంది. 15వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. చార్జింగ్ కోసం Samsung Galaxy M13 5Gకి యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ ఉంటుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.