యాప్నగరం

boAt Wave Lite : బోట్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌వాచ్ - ధర రూ.2వేలలోపే.. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే

boAt Wave Lite Smartwatch: బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌ బోట్ వేవ్ లైట్ వచ్చేసింది. రూ.2వేల ధరతో మంచి స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో లాంచ్ అయింది.

Samayam Telugu 30 Mar 2022, 6:56 pm
ప్రముఖ దేశీయ సంస్థ బోట్ ( boAt ).. వేవ్ సిరీస్‌లో మరో బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో విడుదల చేసింది. బోట్ వేవ్ లైట్ ( boAt Wave Lite ) బుధవారం లాంచ్ అయింది. 1.69 ఇంచుల చతురస్రాకార (Square) డయల్‌తో ఈ వాచ్‌ వస్తోంది. అయితే ఈ రేంజ్‌లో 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉండడం ప్రత్యేకతగా ఉంది. నిరంతర హార్ట్‌రేట్ మానిటరింగ్, SpO2 ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్ లాంటి ప్రధానమైన హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే విభిన్నమైన స్పోర్ట్స్ మోడ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. boAt Wave Lite స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలు ఇవే.
Samayam Telugu బోట్ వేవ్ లైట్ స్మార్ట్‌వాచ్ (Photo: boAt)
Boat wave lite smartwatch


boAt Wave Lite స్మార్ట్‌వాచ్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
బోట్ వేవ్ లైట్ 1.69 ఇంచుల డిస్‌ప్లేను కలిగి ఉంది. 500నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్, 160 డిగ్రీల యాంగిల్ ఆఫ్ వ్యూ, 70 శాతం ఆర్‌జీబీ కలర్ గాముట్ డిస్‌ప్లే ఫీచర్లుగా ఉన్నాయి. స్క్వేర్ డయల్‌తో ఈ వాచ్‌ వస్తోంది. మొత్తంగా దీని బరువు 44.8 గ్రాములుగా ఉంది. వాచ్‌ యూఐను నావిగేట్ చేసేందుకు ఎడమవైపున రోటేటింగ్ బటన్‌ను బోట్ పొందుపరిచింది. 100 వరకు వాచ్‌ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. అధికారిక బోట్ వేరబుల్స్ యాప్‌ (boAt Wearables App) ద్వారా వాచ్‌ ఫేసెస్ మార్చుకోవచ్చు.

నిరంతర హార్ట్‌రేట్ మానిటరింగ్, SpO2 బ్లడ్ ఆక్సిజన్ ట్రాకర్, ఎంతసేపు, ఎలా నిద్రపోయామో విశ్లేషించి చెప్పే స్లీప్ ట్రాకర్ హెల్త్ ఫీచర్లు boAt Wave Lite స్మార్ట్‌వాచ్‌లో ఉన్నాయి. అలాగే రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, యోగా, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్ సహా మొత్తంగా 10 స్పోర్ట్స్ మోడ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ఫిట్, యాపిల్ హెల్త్ ఇంటిగ్రేషన్‌కు కూడా ఈ వాచ్‌ సపోర్ట్ చేస్తుంది. సాధారణంగా బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లో ఇది కనిపించదు.

boAt Wave Lite స్మార్ట్‌వాచ్‌ను బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్‌కు వచ్చే కాల్స్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా యాప్స్ నోటిఫికేషన్లను వాచ్‌లో పొందే ఫీచర్ కూడా ఉంది. ఫుల్ చార్జ్‌పై ఈ వాచ్ 7 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుందని బోట్ పేర్కొంది. ఇక వాటర్, డస్ట్ రెసిస్టెంట్స్ కోసం ఐపీ67 రేటింగ్ ఉంది.

boAt Wave Lite స్మార్ట్‌వాచ్‌ ధరబోట్ వేవ్ లైట్ స్మార్ట్‌వాచ్‌ ధర రూ.1,999గా ఉంది. బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. అమెజాన్, బోట్ అధికారిక వెబ్‌సైట్‌లో మార్చి 31 మధ్యాహ్నం 12 గంటలకు ఈ వాచ్‌ సేల్‌ మొదలవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.