యాప్నగరం

BSNL Plans : తేడా రెండు రూపాయలే - ప్రయోజనాలు చాలా విభిన్నం - ఆ ప్లాన్‌లు ఇవే

BSNL Prepaid Plans : ధరలో రెండు రూపాయల వ్యత్యాసంతో ఉన్న రెండు ప్లాన్‌లు.. బెనిఫిట్స్ విషయంలో చాలా విభిన్నంగా ఉన్నాయి. ఆ రెండు ప్లాన్‌లు ఏంటి.. వాటితో దక్కే ప్రయోజనాలు ఏంటో చూడండి.

Authored byKrishna Prakash | Samayam Telugu 25 Apr 2022, 5:25 pm
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తక్కువ ధరల్లోనే చాలా ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. అలా రూ.300లోపు BSNLలో ఉన్న రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి చూద్దాం. రెండింటి మధ్య ధరలో తేడా రెండు రూపాయలు మాత్రమే. అయితే బెనిఫిట్స్ మాత్రం ఈ రెండింటి మధ్య చాలా విభిన్నంగా ఉంటాయి. ఈ ప్లాన్లు రూ.297, రూ.299. ఈ ప్లాన్‌ల ధర అత్యంత సమీపంలో ఉన్నా.. ప్రయోజనాల్లో ఆసక్తికర తేడాలు ఉన్నాయి. ఓ ప్లాన్‌ తక్కువ డేటా వాడే వారికి సూటవుతుంది. మరో ప్లాన్‌‌తో అధిక డేటా వస్తుంది. అసలు రూ.297, రూ.299 ప్లాన్‌లతో లభించే ప్రయోజనాలు ఏంటో చూడండి.
Samayam Telugu BSNL Plans : తేడా రెండు రూపాయలే -  ప్రయోజనాలు చాలా విభిన్నం
BSNL Rs 297 and Rs 299 Prepaid Plans


BSNL రూ.297 ప్లాన్‌
ఈ ప్లాన్‌ తీసుకుంటే వ్యాలిడిటీ ఎక్కువగా ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ రూ.297 ప్లాన్‌ (BSNL STV_297) తో రీచార్జ్ చేసుకుంటే 54 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రోజులో 1జీబీ డేటా అయిపోతే ఆ తర్వాత 40kbps వేగంతో ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. అలాగే ఈ ప్లాన్‌తో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎరోస్ నౌ (Eros Now) ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

BSNL రూ.299 ప్లాన్‌
రూ.299 ప్లాన్‌ (BSNL STV_299) తీసుకుంటే రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు దక్కుతాయి. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 30రోజులుగా ఉంది. రోజులో 3జీబీ డేటా అయిపోయాక 80 kbps స్పీడ్‌తో డేటా వినియోగించుకోవచ్చు. అయితే ఎలాంటి ఓటీటీ బెనిఫిట్స్ ఉండవు.

రెండు ప్లాన్‌ల మధ్య తేడాలు ఇవే
ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌ల మధ్య ధర తేడా మాత్రం రూ.2గా ఉంది. అయితే బెనిఫిట్స్‌ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ముఖ్యంగా వ్యాలిడిటీ వ్యత్యాసం అధికం. రూ.297 ప్లాన్‌తో 54 రోజుల కాలపరిమితి దక్కుతుండగా.. రూ.299 ప్లాన్‌ 30రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. ఇక డేటా గురించి ప్రస్తావిస్తే, రూ.299 ప్లాన్‌తో ఏకంగా రోజుకు 3జీబీ డేటా దక్కుతుంది. అదే రూ.297 ప్లాన్‌ తీసుకుంటే ప్రతీ రోజూ 1జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు మాత్రం రెండు ప్లాన్‌ల మధ్య కామన్‌గా ఉన్నాయి. ఇక రూ.297 ప్లాన్‌తో ఎరోస్ నౌ సబ్‌స్క్రిప్షన్ కూడా దక్కుతుంది. తక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ కావాలనుకునే వారు రూ.297 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ప్రతీ రోజు ఎక్కువ డేటా అవసరమైన వారికి రూ.299 ప్లాన్‌ బాగా సూటవుతుంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్లలో ఈ రెండు ప్లాన్‌లను BSNL అందుబాటులో ఉంచింది. మిగిలిన సర్కిల్స్‌లో కాస్త విభిన్నంగా కూడా ఉండొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.