యాప్నగరం

NDCP: కొత్త 'టెలికామ్' విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

2022 నాటికి డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ రంగంలో 100 బిలియన డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం, 40 లక్షల ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా కొత్త టెలికామ్ విధానం..

Samayam Telugu 26 Sep 2018, 6:37 pm
టెలికాం రంగంలో సంస్కరణలకు కేంద్రం చర్యలు వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు కొత్త టెలికాం విధానానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం (సెప్టెంబరు 26) ఆమోదముద్ర వేసింది. త్వరలోనే 'నేషనల్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ పాలసీ(ఎన్డీసీపీ)- 2018' పేరుతో ఈ విధానాన్ని అమల్లోకి తేనుంది. 2022 నాటికి డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ రంగంలో 100 బిలియన డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడం, 40 లక్షల ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ఈ కొత్త టెలికామ్ విధానానికి కేంద్రం రూపకల్పన చేసింది.
Samayam Telugu telicompolicy


టెలికాం రంగంలో పెట్టుబడులను పెంచడంతో పాటు 5జీ టెక్నాలజీ సాయంతో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను మెరుగుపర్చడం, అందుబాటు ధరల్లో ఆప్టికల్‌ ఫైబర్‌ సేవలను తీసుకురావడం కోసం ఈ కొత్త విధానాన్ని రూపొందించింది. స్పెక్ట్రమ్‌ ధరలను హేతుబద్ధీకరించడం ద్వారా రూ.7.8లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగాన్ని ఆదుకోవాలన్నది కేంద్రం ఆలోచనగా ఉంది.

అయితే.. ఇలాంటి సమయంలో అధిక స్పెక్ట్రమ్‌ ధరలు, ఇతర ఛార్జీలు టెలికామ్ రంగానికి సవాలుగా మారాయి. దీంతో వీటిని హేతుబద్ధీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే కొత్త టెలికామ్ విధానాన్ని తెరపైకి తెచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.