యాప్నగరం

Dizo Wireless Dash : 30 గంటల బ్యాటరీ లైఫ్‌తో డిజో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - ధర, ఆఫర్, స్పెసిఫికేషన్లు

Dizo Wireless Dash Earphones : డిజో వైర్‌లెస్ డ్యాష్ ఇయర్‌ఫోన్స్ లాంచ్ అయ్యాయి. 30 గంటల బ్యాటరీ లైఫ్, బ్లూటూత్ 5.2, 11.2mm బాస్ బూస్ట్+ డ్రైవర్లతో వస్తున్నాయి. ఇంట్రడక్టరీ ఆఫర్‌తో సేల్‌కు రానున్నాయి.

Authored byKrishna Prakash | Samayam Telugu 17 May 2022, 5:56 pm
రియల్‌మీ టెక్ లైఫ్‌ (Realme Techlife) కు చెందిన డిజో (Dizo) బ్రాండ్ నుంచి మరో నెక్‌బ్యాండ్ స్టైల్ ఇయర్‌ఫోన్స్ లాంచ్ అయ్యాయి. డిజో వైర్‌లెస్ డ్యాష్ (Dizo Wireless Dash) ఇయర్‌ఫోన్స్ మంగళవారం విడుదలయ్యాయి. బాస్ బూస్ట్+ అల్గారిథమ్స్‌తో కూడిన 11.2mm సౌండ్ డ్రైవర్లతో ఈ ఇయర్‌ఫోన్స్ వస్తు్న్నాయి. ఫుల్ చార్జ్‌పై ఏకంగా 30 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుందని Dizo పేర్కొంది. 10 నిమిషాలు చార్జ్ చేస్తే 10 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఉండేలా బ్లింక్ చార్జ్ ఫీచర్‌ను కూడా డిజో వైర్‌లెస్ డ్యాష్ ఇయర్‌ఫోన్స్ కలిగి ఉన్నాయి. అలాగే గేమింగ్ మోడ్ కోసం లో ల్యాటెన్సీ కూడా అందుబాటులో ఉంటుంది. Dizo Wireless Dash పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర, సేల్ వివరాలు..
Samayam Telugu dizo wireless dash 30hours play blink charge by realme tech life launched
Dizo Wireless Dash : 30 గంటల బ్యాటరీ లైఫ్‌తో డిజో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ - ధర, ఆఫర్, స్పెసిఫికేషన్లు


Dizo Wireless Dash ఇయర్‌ఫోన్స్ ధర, సేల్
డిజో వైర్‌లెస్ డ్యాష్‌ ఇయర్‌ఫోన్ రూ.1,599 ధరకు లాంచ్ అయ్యాయి. అయితే ఇంట్రడక్టరీ ఆఫర్ కింద రూ.1,299కే సేల్‌కు రానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈనెల 24న సేల్ మొదలవుతుంది. క్లాసిక్ బ్లాక్, డైనమిక్ గ్రీన్, ఎలక్ట్రిక్ బ్లూ కలర్ ఆప్షన్‌లో ఈ ఇయర్‌ఫోన్స్ అందుబాటులోకి వస్తాయి.

Dizo Wireless Dash స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
డిజో వైర్‌లెస్ డ్యాష్ ఇయర్‌ఫోన్స్‌లో 260mAh బ్యాటరీ ఉంటుంది. ఫుల్ చార్జ్‌పై 30 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. కేవలం 10 నిమిషాల చార్జ్‌తోనే 10 గంటల ప్లేబ్యాక్ టైమ్ వచ్చేలా బ్లింక్ చార్జ్ (Blink Charge) ఫీచర్‌ను డిజో పొందుపరిచింది. 11.2mm సౌండ్ డ్రైవర్లతో (11.2mm Sound Drivers) ఈ ఇయర్‌ఫోన్ వస్తున్నాయి. బాస్ ఎక్కువగా ఉండేలా బాస్ బూస్ట్+ (Bass Boost+) అల్గారిథమ్స్‌ను ఈ డ్రైవర్లు కలిగి ఉన్నాయి. ఇక కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.2 (Bluetooth v5.2) ఉంటుంది. గేమింగ్ కోసం లో ల్యాటెన్సీ మోడ్ కూడా అందుబాటులో ఉంది.

సాఫ్ట్ సిలికాన్ మెటీరియల్‌తో Dizo Wireless Dash ఇయర్‌ఫోన్స్‌ను డిజో రూపొందించింది. అలాగే ఈ నెక్‌బ్యాండ్ షేప్ కోల్పోకుండా మెమరీ మెటల్‌ను ఉంచినట్టు డిజో పేర్కొంది. కెల్వర్ టైక్స్‌చర్డ్ డిజైన్‌తో Dizo Wireless Dash ఇయర్‌ఫోన్స్ వస్తున్నాయి. వాటర్, స్వెట్ రెసిస్టెంట్స్ కోసం IPX4 రేటింగ్‌ డిజైన్‌ను కలిగి ఉంది. ఇక ఇయర్‌ఫోన్స్ మ్యాగ్నటిక్ ఎండ్‌తో ఉన్నాయి. వీటిని విడదీస్తే వెంటనే కనెక్ట్ అవుతాయి. రెండు బడ్స్‌ను కలిపితే డిస్‌కనెక్ట్ అవుతాయి. రియల్‌మీ లింక్ యాప్‌కు Dizo Wireless Dash ఇయర్‌ఫోన్స్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఈక్వలైజర్‌తో పాటు మరిన్ని సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.