యాప్నగరం

పోకో నుంచి తొలి స్మార్ట్‌వాచ్ లాంచ్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.. TWS ఇయర్‌బడ్స్ కూడా..

Poco Watch : పోకో బ్రాండ్ నుంచి తొలిసారి స్మార్ట్‌వాచ్‌ వచ్చేసింది. AMOLED డిస్‌ప్లే, ఇన్‌బుల్ట్ జీపీఎస్, ముఖ్యమైన హెల్త్ ట్రాకర్లు, 100కుపైగా స్పోర్ట్స్ మోడ్స్‌తో ఈ వాచ్‌ గ్లోబల్‌గా లాంచ్ అయింది. త్వరలోనే భారత మార్కెట్‌లో విడుదల కానుంది. అలాగే పోకో బడ్స్ ప్రో జెన్షిన్ ఇంపాక్ట్ ఎడిషన్ (Poco Buds Pro Genshin Impact Edition) TWS ఇయర్‌బడ్స్ కూడా లాంచ్ అయ్యాయి.

Authored byKrishna Prakash | Samayam Telugu 27 Apr 2022, 12:28 pm
బడ్జెట్, మిడ్‌రేంజ్‌లో మంచి స్పెసిఫికేషన్లతో స్మార్ట్‌ఫోన్‌లు తీసుకొస్తున్న చైనీస్ సంస్థ పోకో (Poco) తొలిసారి స్మార్ట్‌వాచ్‌ (Smartwatch) ను లాంచ్ చేసింది. పోకో వాచ్‌ (Poco Watch)ను గ్లోబల్‌గా విడుదల చేసింది. త్వరలోనే ఇది భారత్‌కు రానుంది. ఈ వాచ్‌తో పాటు పోకో బడ్స్ ప్రో జెన్షిన్ ఇంపాక్ట్ ఎడిషన్ (Poco Buds Pro Genshin Impact Edition) TWS ఇయర్‌బడ్స్‌ కూడా తీసుకొచ్చింది. 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్, ప్రధానమైన హెల్త్ ఫీచర్లతో పోకో వాచ్‌ వస్తోంది. అలాగే జీపీఎస్‌ ఫీచర్ కూడా ఉంటుంది. అలాగే మంచి బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. AMOLED కర్వ్‌డ్ డిస్‌ప్లే Poco Watch ప్రధానమైన ఆకర్షణగా ఉంది.
Samayam Telugu పోకో నుంచి తొలి స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Poco)
Poco watch launched


Poco Watch స్పెసిఫికేషన్లు
పోకో వాచ్‌ 320x360 పిక్సెల్ రెజల్యూషన్ ఉన్న 1.6 ఇంచుల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 2.5డీ కర్వ్‌డ్ గ్లాస్ ప్రొటెక్షన్, 301ppi పిక్సెల్ డెన్సిటీ ఉంటుంది. ఆల్‌వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్ కూడా ఉంటుంది. నిరంతర హార్ట్‌రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ (SpO2), ఎలా నిద్రపోయామో చెప్పే స్లీప్ మానిటర్, బ్రీత్ ఎక్సర్‌సైజ్, స్ట్రెస్ మానిటరింగ్ హెల్త్ ఫీచర్లతో ఈ వాచ్‌ వస్తోంది.

బుల్ట్‌ఇన్ GPS సపోర్ట్ కూడా POCO Watchలో ఉంది. GNSS చిప్‌ ఉండడంతో స్టాండ్అలోన్ జీపీఎస్ ట్రాకింగ్‌ ఉంటుంది. ఇక యాక్సెలోమీటర్, జైరోస్కోర్, మాగ్నోమీటర్ సెన్సార్‌లు ఈ స్మార్ట్‌వాచ్‌లో ఉంటాయి. ఇక ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్‌లకు కనెక్ట్ చేసుకునేందుకు బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ ఉంటుంది. వాటర్ రెస్టింట్ కోసం 5ATM రేటింగ్ ఉంటుంది. దీంతో ఈ వాచ్‌ ధరించి స్విమ్ కూడా చేయవచ్చు. అయితే దాదాపు 50మీటర్ల నీటి లోతు వరకు ఈ రెసిస్టెంట్ పని చేస్తుంది.

Poco Watch పర్సనలైజ్డ్ వాచ్‌ ఫేసెస్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. దీంతో మీకు ఇష్టమైన ఫొటోలతో వాచ్‌ ఫేసెస్ సెట్ చేసుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్‌వాచ్‌లో 225mAh బ్యాటరీ ఉంటుంది. ఫుల్ చార్జ్‌పై 14 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. మొత్తం ఈ వాచ్‌ బరువు 31 గ్రాములుగా ఉంటుంది.

Poco Watch ధర
పోకో వాచ్‌ ధర యూరప్ మార్కెట్‌లో 79 యూరోలు (సుమారు రూ.6,400)గా ఉంది. బ్లూ, బ్లాక్, ఇవోరీ కలర్స్‌లో లాంచ్ అయింది. త్వరలోనే ఈ వాచ్ భారత్‌కు రానుండగా.. ధర కూడా ఇదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.

మరోవైపు, పోకో బడ్స్ ప్రో జెన్షిన్ ఇంపాక్ట్ ఎడిషన్ TWS ఇయర్‌బడ్స్.. 9mm కంపోజైట్ డైనమిక్ డ్రైవర్లను కలిగి ఉన్నాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ (ANC) కూడా ఉంటుంది. ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఈ బడ్స్ సింగిల్ చార్జ్‌పై ఆరు గంటల ప్లేబ్యాక్ టైమ్ ఇస్తాయి. చార్జింగ్ కేస్‌తో మరో నాలుగుసార్లు బడ్స్‌ను చార్జ్ చేయవచ్చు. అంటే మొత్తంగా 28 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. Poco Buds Pro Genshin Impact Edition ధర 69 యూరోలు (సుమారు రూ.5,600)గా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.