యాప్నగరం

Coronavirus Effect: పూర్తిగా బంద్ అయిన ఫ్లిప్ కార్ట్! ఎప్పటివరకు అంటే?

ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ పై కరోనావైరస్ ప్రభావం పడింది. ఫ్లిప్ కార్ట్ తన సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆన్ లైన్ ఉత్పత్తుల అమ్మకం, వాటిని డెలివరీ చేయడం వంటి సేవలు రానున్న కొన్ని రోజులు నిలిచిపోనున్నాయి.

Samayam Telugu 25 Mar 2020, 2:39 pm
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ పై కరోనావైరస్ ప్రభావం బలంగా పడింది. ప్రధాని నరేంద్రమోదీ 21 రోజుల పాటు దేశాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించడంతో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. సేవలు అంటే ఆన్ లైన్ లో ఉత్పత్తుల అమ్మకం, వాటిని డెలివరీ చేయడం వంటివి అన్నమాట. వీడియో స్ట్రీమింగ్, బిల్ పేమెంట్, ఆన్ లైన్ మొబైల్ గేమ్స్ వంటి సేవలను ఫ్లిప్ కార్ట్ లో ఉపయోగించుకోవచ్చు.
Samayam Telugu Flip


Also Read: ఈ నెలలో రూ.15 వేలలోపు లాంచ్ అయిన టాప్ ఫోన్లు ఇవే! వీటిలో ఏది బెస్ట్?

అమెజాన్ కేవలం అవసరమైన ఉత్పత్తులకు సంబంధించిన ఆర్డర్లను మాత్రమే స్వీకరిస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికే ఫ్లిప్ కార్ట్ ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు వివరణ కూడా ఇచ్చింది. వినియోగదారుల అవసరాలకే తాము ప్రాముఖ్యతను ఇస్తామని తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, అతి త్వరలోనే తిరిగి సేవలను పునరుద్ధరిస్తామని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

అయితే ఫ్లిప్ కార్ట్ రానున్న 21 రోజుల వరకు తమ సేవలను తిరిగి ప్రారంభించే అవకాశం లేదు. అయితే అమెజాన్ మాత్రం తన సేవలను అత్యవసరమైన ఉత్పత్తులకు మాత్రమే అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఫ్లిప్ కార్ట్ లో బిల్ పేమెంట్, వీడియో స్ట్రీమింగ్ వంటి సేవలను మాత్రం ఇప్పటికీ అందిస్తున్నారు.

Also Read: Jio సిమ్ వాడుతున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఇవే!

ప్రస్తుతానికి ఫ్లిప్ కార్ట్ లో ఉన్న ఉత్పత్తులన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తున్నాయి. అయితే ఫోన్, వాటర్, ఎలక్ట్రిసిటీ, బ్రాడ్ బ్యాండ్ వంటి అత్యవసరమైన బిల్లులను మాత్రం వినియోగదారులు చెల్లించవచ్చు. ఫ్లిప్ కార్ట్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం ద్వారా వినియోగదారులు ఇంట్లోనే ఉంటూ సినిమాలు, టీవీ షోలు చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.

Also Read: Coronavirus: ఆన్ లైన్ లో ఈ 10 విషయాలను అస్సలు సెర్చ్ చేయకండి!

అలాగే గేమ్ జోన్ ద్వారా వినియోగదారులు తమ ఫోన్లలో ఆన్ లైన్ గేమ్స్ ఆడుకోవచ్చు. క్రియేటర్ సెంట్రల్ ద్వారా డీఐవై ఆర్ట్, క్రాఫ్ట్ వీడియోలను చూడవచ్చు. ఫ్లిప్ కార్ట్ గివ్ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా హెల్త్ కిట్లను అందిస్తూ కరోనా వైరస్ పై పోరాటం చేయడానికి తనవంతు సాయం చేస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.