యాప్నగరం

Google Pixel Tablet : గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్‌.. స్పెసిఫికేషన్లు లీక్.. భారత్‌కు కూడా!

Google Pixel Tablet : గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు తాజా లీక్ అయ్యాయి. ఇంజినీరింగ్ వ్యాలిడేషన్ టెస్ట్ కోసం ఇండియాకు గూగుల్ ఈ ట్యాబ్లెట్‌కు చెందిన కొన్ని యూనిట్స్ పంపగా.. వివరాలు బయటికి వచ్చాయి.

Authored byKrishna Prakash | Samayam Telugu 23 Sep 2022, 4:18 pm
Google Pixel Tablet Specifications : ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ (Google).. పిక్సెల్ లైనప్‌లో ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్ (Google Pixel Tablet) టెస్టింగ్ కోసం మోడల్స్‌ను తయారు చేసిందని తెలుస్తోంది. ఇంజినీరింగ్ వాలిడేషన్ టెస్ట్ (Engineering validations test - EVT) కోసం ఇండియాకు పిక్సెల్ ట్యాబ్లెట్‌ను గూగుల్ పంపిందని రిపోర్ట్ బయటికి వచ్చింది. ఈవీటీతో పాటు సర్టిఫికేషన్ కోసం గూగుల్.. ఈ పిక్సెల్ ట్యాబ్లెట్‌లను భారత్‌కు పంపిదని తెలుస్తోంది. దీంతో భారత్‌లోనూ ఈ గూగుల్ పిక్సెల్ ట్యాబ్ లాంచ్ కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే వ్యాలిడేషన్ టెస్ట్ కోసం యూనిట్స్ పంపడంతో గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్‌కు చెందిన కొన్ని కీలక స్పెసిఫికేషన్లు లీకయ్యాయి.
Samayam Telugu Google Pixel Tablet Specifications leaked
గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్ (Photo: Google)


2023లో పిక్సెల్ ట్యాబ్లెట్‌ను లాంచ్ చేస్తామని ఈ ఏడాది జూలైలో జరిగిన I/O డెవలర్స్ కాన్ఫరెన్స్‌లోనూ గూగుల్ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్‌ 6వ తేదీన జరిగే లాంచ్ ఈవెంట్‌లో గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ (Google Pixel 7 Series), పిక్సెల్ వాచ్‌(Pixel Watch) ను గూగుల్ లాంచ్ చేయనుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్‌ను తీసుకురానుంది. మరి తాజాగా ఈ ట్యాబ్లెట్ గురించి లీకైన స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో చూడండి.

Google Pixel Tablet స్పెసిఫికేషన్లు
గూగుల్ సొంత ప్రాసెసర్‌ టెన్సార్ (Tensor) ఈ పిక్సెల్ ట్యాబ్లెట్‌లో ఉంటుంది. ఫస్ట్ జనరేషన్ టెన్సార్‌ ప్రాసెసర్‌తో ఈ ట్యాబ్‌ను గూగుల్ తీసుకురానుందని తెలుస్తోంది. 10.95 ఇంచుల డిస్‌ప్లేను ఈ పిక్సెల్ ట్యాబ్లెట్ కలిగి ఉంటుందని లీక్‌ల ద్వారా వెల్లడైంది. USI 2.0 స్టైలస్‌కు సపోర్ట్ చేస్తుంది. 128జీబీ స్టోరేజ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌లలో ఈ ట్యాబ్ అందుబాటులోకి రానుంది.

వైఫై 6 కనెక్టివిటీతో Google Pixel Tablet వస్తుందని లీక్‌ల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ ట్యాబ్‌లో జీపీఎస్ కోసం ఎలాంటి హార్డ్‌వేర్, మోడెర్మ్ లేదని లీకైంది. అలాగే ప్రాగ్జిమిటీ, బారోమీటర్ సెన్సార్లు కూడా ఉండకపోవచ్చు. ఇక ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ గూగుల్ పిక్సెల్ ట్యాబ్లెట్ లాంచ్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు, ఇంజినీరింగ్ వ్యాలిడేషన్ టెస్ట్ కోసం యూనిట్లు పంపడంతో భారత్‌లోనూ ఈ పిక్సెల్ ట్యాబ్లెట్ లాంచ్ అవడం ఖాయమని అంచనాలు వెలువడుతున్నాయి. ఈవీటీ తర్వాత డిజైన్ వ్యాలిడేషన్ టెస్ట్‌, ప్రొడక్షన్‌ను గూగుల్ చేపట్టనుంది.

మరోవైపు, ఈ ఏడాది అక్టోబర్‌ 8వ తేదీన గూగుల్ పిక్సెల్ 7, గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. వీటితో పాటు రెండు పిక్సెల్ వాచ్‌లను కూడా గూగుల్ లాంచ్ చేయనుంది. ఈ పిక్సెల్ 7 సిరీస్ ఇండియాలోనూ అందుబాటులోకి తెస్తామని గూగుల్ ఇప్పటికే ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.