యాప్నగరం

గబ్బా విజయంతో గూగుల్ పండగ.. ఇలా సెర్చ్ చేస్తే త్రివర్ణాల్లో వేడుకలు!

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కూడా భారత జట్టు విజయాన్ని పండగలా చేసుకుంటోంది. గూగుల్‌లో ‘India National Cricket Team’ లేదా ‘Ind Vs Aus’ అని సెర్చ్ చేస్తే త్రివర్ణాల్లో వర్చువల్ టపాకాయలు పేలడం చూడవచ్చు.

Samayam Telugu 20 Jan 2021, 6:52 pm
భారత క్రికెట్ జట్టు గబ్బాలో ఆస్ట్రేలియాను ఓడించిన సంగతి తెలిసిందే. 32 సంవత్సరాల తర్వాత గబ్బా(బ్రిస్బేన్ క్రికెట్ స్టేడియం)లో ఆస్ట్రేలియా ఓడిపోవడం ఇదే మొదటిసారి. దేశం మొత్తం ఈ విజయాన్ని పండగలా జరుపుకుంటున్నారు. ఎంతో మంది ప్రముఖ రాజకీయ నాయకులు, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ వంటి టెక్ దిగ్గజాలు టీమిండియా గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు.
Samayam Telugu Google Celebrates

వివో వై31 వచ్చేసింది.. ఈ నెలలో ఇది నాలుగో వివో ఫోన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
ఇప్పుడు గూగుల్ కూడా భారత విజయాన్ని వర్చువల్‌గా జరుపుకుంటోంది. గూగుల్‌లో ‘India National Cricket Team’ లేదా ‘Ind Vs Aus’ అని సెర్చ్ చేస్తే త్రివర్ణాల్లో వర్చువల్ టపాకాయలు పేలడం చూడవచ్చు. బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో టెస్టులో భారత జట్టు ఊహించని రీతిలో ఆస్ట్రేలియాను ఓడించాక గూగుల్ కూడా దీన్ని గొప్ప విజయంగా గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. 328 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు మిగిలి ఉండగానే చేధించడంతో ఫేస్ బుక్, ట్వీటర్ వంటి ప్లాట్ ఫాంల్లో నెటిజన్లు దీన్ని పండగలా జరుపుకుంటున్నారు.

డెస్క్ టాప్, మొబైల్ డివైసెస్‌లో కూడా ఈ వర్చువల్ ఫైర్ వర్క్స్‌ను గమనించవచ్చు. కొంతమంది క్రికెట్ ప్రేమికులు ఈ అప్ డేట్ ఇచ్చినందుకు గూగుల్‌కు థ్యాంక్స్ కూడా చెబుతున్నారు. ఈ వర్చువల్ ఫైర్ వర్క్స్ మన త్రివర్ణ పతాకపు రంగుల్లో రావడం మరింత ఆనందాన్ని కలిగించే అంశం.

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వంటి టెక్ దిగ్గజాలు కూడా నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ను గెలుచుకున్నందుకు భారత క్రికెట్ జట్టును అభినందించారు. ఈ విజయంతో టెస్టు చాంపియన్ షిప్‌లో కూడా భారతదేశం మొదటి స్థానానికి ఎగబాకింది.

భారత జట్టు ఘనవిజయం కారణంగా #INDvsAUS, #TeamIndia హ్యాష్ ట్యాగులు ట్వీటర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాంల్లో ట్రెండ్ అయ్యాయి. ఈ విజయంపై కొన్ని వేల పోస్టులు ఆన్ లైన్‌లో చూడవచ్చు. సిరీస్‌కు ముందు భారత జట్టు గెలవలేదన్న విదేశీ క్రికెటర్లు కూడా టీమిండియా అసాధారణ విజయానికి సాహో అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.