యాప్నగరం

ఎప్పట్నుంచో ఊరిస్తున్న Honor 9x వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హానర్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేయనున్న హానర్ 9ఎక్స్ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో లాంచ్ అవ్వడానికి రంగం సిద్ధం అయింది. ఈ ఫోన్ ను జనవరి 14న లాంచ్ చేయనున్నట్లు హానర్ ప్రకటించింది.

Samayam Telugu 6 Jan 2020, 3:08 pm
ఈ మధ్యకాలంలో భారతీయులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్ ఫోన్ హానర్ 9ఎక్స్. దీనికి సంబంధించిన లాంచ్ మనదేశంలో జనవరి 14న జరగనుంది. ఈ మేరకు ఫ్లిప్ కార్ట్ లో ఒక ప్రత్యేక పేజీ(మైక్రో సైట్) ప్రత్యక్షమయింది. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేస్తామని హానర్ ఇండియా ప్రెసిడెంట్ చార్లెస్ పెంగ్ కొద్ది రోజుల క్రితమే తెలిపారు. ఒక్కసారి గతంలోకి వెళితే.. హానర్ 9ఎక్స్, హానర్ 9 ఎక్స్ ప్రో గత జూలైలోనే చైనాలో లాంచ్ అయ్యాయి.
Samayam Telugu honor 9x to be launched in india on january 14 full details
ఎప్పట్నుంచో ఊరిస్తున్న Honor 9x వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?


​9ఎక్స్ తో పాటు ప్రో వెర్షన్ కూడా లాంచ్ కానుందా?

హానర్ విడుదల చేసిన ఆహ్వాన ప్రకటనను చూసినట్లయితే బ్యాక్ గ్రౌండ్ లో X అని రాసి, దాని ముందువైపు జనవరి 14 అని లాంచ్ డేట్ ను ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే హానర్ కేవలం 9ఎక్స్ ను మాత్రమే విడుదల చేస్తుందా? దాంతో పాటు హానర్ 9ఎక్స్ ప్రోను కూడా విడుదల చేస్తుందా? అనే విషయంపై ఎటువంటి స్పష్టతా రాలేదు. ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన విడుదల ప్రణాళిక గురించి హానర్ ఇండియా ప్రెసిడెంట్ చార్లెస్ పెంగ్ గతంలో మాట్లాడుతూ ఈ ఫోన్ ను జనవరిలో లాంచ్ చేస్తామని తెలిపారు. ఆండ్రాయిడ్, GMS(గూగుల్ మొబైల్ సర్వీసెస్)లపై ఆధారపడి ఈ ఫోన్ పని చేస్తుందని, గూగుల్ ప్లే కూడా ఈ ఫోన్ లో అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.


Also Read: ఈ నెలలో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? రూ.15,000లోపు బెస్ట్ ఫోన్స్ ఇవే!

Twitter-Are you #UpForXtra fabulous features from your nex...

​ధర ఎంత ఉండవచ్చు?

హానర్ 9ఎక్స్ భారత మార్కెట్లో లాంచ్ అవ్వకపోయినా, చైనాలో ఇప్పటికే లాంచ్ అయింది. ఈ ఫోన్ లో మొత్తం మూడు వేరియంట్ల అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యువాన్లుగా(సుమారు రూ.14,400) నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 యువాన్లుగానూ(సుమారు రూ.16,500), 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,899 యువాన్లుగానూ(సుమారు రూ.19,600) నిర్ణయించారు. భారత మార్కెట్లో కూడా వీటి ధరలు దాదాపు ఇలాగే ఉండే అవకాశం ఉంది.


Also Read: రంగులు మార్చే ఫోన్.. కెమెరాలూ కనిపించవు.. Oneplus కొత్త కాన్సెప్ట్!

Twitter-Half a decade and five models that changed the fac...

​స్పెసిఫికేషన్లు ఇవే!

ఈ ఫోన్ లో 6.59 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించనున్నారు. ఆక్టాకోర్ హైసిలికాన్ కిరిన్ 810 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ను ఇందులో అందించారు. ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ గా ఉంది. 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ లు కూడా ఇందులో ఉన్నాయి. 16 మెగా పిక్సెల్ పాపప్ సెల్ఫీ కెమెరా కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ Pie ఆధారిత ఈఎంయూఐ 9.1.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.


Also Read: మరో Lite ఫోన్ ను లాంచ్ చేసిన Samsung.. ఈ ఫోన్ ఎలా ఉందంటే?

​మరి మిగతా ఫీచర్లు?

దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ గా ఉండనుంది. 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఫీచర్లను ఇందులో అందించారు. బ్యాటరీ సామర్థ్యం 4,000 ఎంఏహెచ్ గా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా ఇందులో అందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.