యాప్నగరం

Republic Day 2022: ఢిల్లీలో జరిగే పరేడ్‌ను మొబైల్‌లోనే లైవ్‌లో చూడండిలా.. ప్రభుత్వ యాప్‌ ఇదే

Republic Day Parade: ఢిల్లీలో అత్యంత వైభవంగా జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌ను స్మార్ట్‌ఫోన్‌లోనే ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ యాప్ కూడా తీసుకొచ్చింది.

Samayam Telugu 25 Jan 2022, 9:06 pm
గణతంత్ర దినోత్సవ (Republic Day) సంబరాలకు భారత దేశమంతా సిద్ధమైంది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును స్మరించుకుంటూ ప్రతీ సంవత్సరం జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే వైభవంగా జరుగుతోంది. అలాగే ప్రతీ గణతంత్ర దినోత్సవం రోజున దేశరాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో పరేడ్ అత్యద్భుతంగా సాగుతుంది. రాష్ట్రాలు, మంత్రిత్వ శాఖలు, సాయుధ దళాలు, కళాకారులు, పాఠశాలల విద్యార్థులు పరేడ్‌లో పాల్గొంటారు. అయితే కరోనా వైరస్ (COVID-19) వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) విజృంభిస్తున్న కారణంగా ఈ సంవత్సరం వేడుకలను ప్రత్యక్షంగా చూసేందుకు పరిమిత సంఖ్యలోనే ప్రజలను అనుమతించనుంది ప్రభుత్వం. టీవీ చానెళ్లు ఈ గణతంత్ర దినోత్సవ ప్రత్యక్ష ప్రసారాలను అందించనున్నాయి. అయితే మొబైల్‌లోనే రిపబ్లిక్ డే వేడుకల పరేడ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూసే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రభుత్వమే ఓ ప్రత్యేకమైన యాప్ తీసుకొచ్చింది. ఇందులో వివిధ వ్యూయింగ్ ఆప్షన్లతో పరేడ్‌ను వీక్షించవచ్చు.
Samayam Telugu Republic Day 2022: ఢిల్లీలో జరిగే పరేడ్‌ను మొబైల్‌లోనే లైవ్‌లో చూడండిలా..
Republic Day Parade 2022 live


ప్రజలు స్మార్ట్‌ఫోన్‌తో పాటు కంప్యూటర్లలోనూ రిపబ్లిక్ డే పరేడ్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించే సదుపాయాన్ని కల్పిస్తోంది ప్రభుత్వం. మీరు గణతంత్ర దినోత్సవ పరేడ్‌ను లైవ్‌లో చూడాలనుకుంటున్నారా.. అయితే ఈ స్టెప్స్ పాటించండి.

  • ఆండ్రాయిడ్ ఫోన్ అయితే గూగుల్ ప్లే స్టోర్, ఐఫోన్ అయితే యాప్ స్టోర్ ఓపెన్ చేయాలి.
  • సెర్చ్ బార్‌లో రిపబ్లిక్ డే ఇండియా (Republic day India) అని టైప్ చేయాలి. ఆ తర్వాత సెర్చ్‌పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) రూపొందించిన Republic day India యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • Republic day India డౌన్‌లోడ్ అయ్యాక ఓపెన్ బటన్‌పై క్లిక్ చేయాలి. యాప్ ఓపెన్ అయ్యాక పై ఎడమ భాగంలో ఉండే ఐకాన్‌ను క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత 360 లైవ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • మీరు ఏ విధంగా లైవ్ చూడాలనుకుంటున్నారో ఆప్షన్ ఎంచుకోవచ్చు.
ఇక ఏ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోకుండా కూడా Republic day 2022 Parade లైవ్‌ను ఆన్‌లైన్‌లో చూసే అవకాశం ఉంది. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్ వెబ్‌ బ్రౌజర్‌లో https://indianrdc.mod.gov.in/ లింక్‌లోకి వెళ్లాలి. ఈ లింక్ ద్వారా కంప్యూటర్‌లోనూ పరేడ్ లైవ్ వీక్షించవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.