హువావే కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అదే హువావే నోవా 8 ఎస్ఈ విటాలిటీ ఎడిషన్. మొదటగా చైనాలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఆక్టాకోర్ కిరిన్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కెమెరా కోసం హోల్ పంచ్ కటౌట్‌ను కూడా అందించారు. హువావే నోవా 8 ఎస్ఈ విటాలిటీ ఎడిషన్ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 1,899 యువాన్లుగా(సుమారు రూ.21,700) నిర్ణయించారు. ఫ్రాస్ట్ సిల్వర్, మ్యాజిక్ నైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. చైనాలో దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ఆగస్టు 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
హువావే నోవా 8 ఎస్ఈ విటాలిటీ ఎడిషన్ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఈఎంయూఐ 10.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేను అందించారు. ఆక్టాకోర్ కిరిన్ 710ఏ ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ కాగా, 40W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 4జీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, యూఎస్బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో అందించారు. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 179 గ్రాములుగా ఉంది.