యాప్నగరం

Instagram వాడుతున్న వారికి.. రీల్స్ రీచ్ పెరిగేలా కొత్త ఫీచర్

Instagram New Features : ఇన్‌స్టాగ్రామ్‌కు కొత్తగా మరో మూడు ఫీచర్లు యాడ్ కానున్నాయి. క్రాస్ పోస్టింగ్ ఇందులో ఆకర్షణీయంగా ఉంది. రీల్స్‌కు కూడా సొంత సిక్కర్స్ యాడ్ చేసుకునే సదుపాయం రానుంది. అతిత్వరలోనే ఈ ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి వస్తాయి. ఎలా యూజ్ అవుతాయో చూడండి.

Authored byKrishna Prakash | Samayam Telugu 24 Aug 2022, 8:24 am
పాపులర్ ఫొటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్(Instagram)కు మరిన్ని ఫీచర్లు వచ్చేస్తున్నాయి. మూడు కొత్త ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్ బాస్ ఆడమ్ మొస్సెరీ (Instagram CEO Adam Mosseri) ప్రకటించారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా వీడియోలపైనే ఇన్‌స్టాగ్రామ్ దృష్టి పెట్టింది. అందుకే రీల్స్‌కు వరుసగా ఫీచర్లను తెస్తూనే ఉంది. యూజర్లకు మరిన్ని సదుపాయాలను అందించే విధంగా, రీల్స్‌ను మరింత క్రియేటివ్‌గా చేసేలా ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పుడు కూడా మూడు ఫీచర్లను రీల్స్ కోసమే తెచ్చింది ఇన్‌స్టాగ్రామ్. అయితే రీల్స్‌కు రీచ్ పెరిగేందుకు ఇందులో ఓ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఫేస్‌బుక్‌లో క్రాస్ పోస్టింగ్ చేసేలా ఈ కొత్త ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ తీసుకొస్తోంది. ఇదెలా పని చేస్తోంది.. ఈ కొత్త ఫీచర్ల వివరాలు చూడండి.
Samayam Telugu Instagram New Features


కొత్త ఫీచర్ల వివరాలను ఇన్‌స్టాగ్రామ్ సీఈవో ఆడమ్ వెల్లడించారు. ట్విట్టర్‌లో వీడియో ద్వారా వీటిని ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఫేస్‌బుక్‌లో క్రాస్ పోస్టింగ్ గురించి ఇందులోనే వివరించారు. “రీల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసే సదుపాయాన్ని ఈ క్రాస్ పోస్ట్ ఫీచర్ కల్పిస్తుంది. రెండు యాప్స్‌లో మీకు అకౌంట్ ఉంటే.. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేస్తే చాలు.. ఫేస్‌బుక్‌లోనూ అవి పోస్ట్ అవుతాయి. దీని ద్వారా మీ రీల్స్‌కు రీచ్ పెరుగుతుంది” అని ఆయన వివరించారు. ఫేస్‌బుక్‌లో క్రాస్-పోస్ట్ అవ్వాలనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే, ఇన్‌స్టాలో రీల్ పోస్ట్ చేసిప్పుడు.. అది మీ ఫేస్‌బుక్ ఫీడ్‌లోనూ ఆటోమేటిక్‌గా పోస్ట్ అవుతుంది. దీని ద్వారా ఆ రీల్‌కు ఫేస్‌బుక్ నుంచి కూడా రీచ్ లభిస్తుంది. దీంతో మీ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. అతిత్వరలోనే యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.
రీల్స్‌కు యూజర్లు తాము క్రియేట్ చేసిన స్టిక్కర్లను (Add Yours stickers) యాడ్ చేసుకునే ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం స్టోరీ వీడియోలకు ఈ ఫీచర్ పాపులర్‌గా ఉంది. ఇప్పుడు రీల్స్‌ కూడా Add Yoursను తెచ్చింది. ట్రెండ్స్‌‌‌పై ట్యాప్ చేసి స్టోరీని క్రియేట్ చేసుకునే సదుపాయం ఈ ఫీచర్‌తో లభిస్తోంది. రీల్స్‌కు కూడా ఈ ఫీచర్ అతిత్వరలో యాడ్ కానుంది.
ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన రీల్స్ ఇన్‌సైట్స్ చూసేలా కూడా కొత్త ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ తీసుకొచ్చింది. రీచ్, యూవరేజ్ వ్యూ టైమ్, టోటల్ వ్యూ టైమ్‌ను ఈ ఇన్‌సైట్స్‌లో చూడవచ్చు. దీంతో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన మీ రీల్ వీడియో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో క్లియర్‌గా తెలుసుకోవచ్చని ఆడమ్ మొస్సెరీ తెలిపారు.
ఈ మూడు ఫీచర్లు.. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అతిత్వరలోనే యాడ్ కానున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.