యాప్నగరం

AC కొనాలనుకుంటున్నారా - ఇన్వర్టర్ ఏసీ, నాన్ ఇన్వర్టర్ ఏసీ మధ్య తేడాలు తెలుసుకోండి

Inverter AC vs Non Inverter AC : ఏసీ కొనాలనుకుంటే ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న, ఇన్వర్టర్ టెక్నాలజీ లేని AC మధ్య తేడాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఏది బెస్ట్. ఏది సూటవుతుందనేది నిర్ణయించుకోవాలి.

Samayam Telugu 22 Mar 2022, 6:05 pm
వేసవి కాలం వచ్చేంది. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో ఎయిర్ కండీషనర్ (Air Conditioner - AC) కొనాలని చాలా మంది అనుకుంటుంటారు. ఇళ్లతో పాటు కార్యాలయాల్లోనూ ఏసీలు ( ACs ) చాలా అవసరంగా మారిపోయాయి. అధిక వేడి నుంచి ఉపశమనం ఉండాలంటే ఏసీలు మంచి మార్గం మార్గంగా ఉన్నాయి. దీంతో చాలా మంది వీటిపైపే మొగ్గుచూపుతున్నారు. అయితే AC కొనే ముందు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇన్వర్టర్ ఏసీ, నాన్-ఇన్వర్టర్ ఏసీ అంటే ఏంటి.. వాటి మధ్య తేడాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏది బెస్ట్.. మీ అవసరాలకు ఏది సూటవుతుందో ఎంపిక చేసుకోవాలి. Inverter AC, Non Inverter AC మధ్య తేడాలు ఇవే.
Samayam Telugu Inverter AC vs Non Inverter AC
Inverter AC vs Non Inverter AC


ఇన్వర్టర్ ఏసీ (Inverter Air Conditioner) అంటే..
ఏసీల్లో ఇన్వర్టర్ టెక్నాలజీ.. ఎలక్ట్రిక్ వోల్టేజ్, విద్యుత్, ఫ్రీక్వెన్సీ కంట్రోలర్‌గా పని చేస్తుంది. కంప్రెజర్‌కు అవసమైన మేర పవర్‌ను సరఫరా చేసి కూలింగ్‌పై కంట్రోల్ ఉండేలా ఉపయోగపడుతుంది. కంప్రెజర్, కూలింగ్ ఎఫెక్ట్‌పై ఇన్వర్టర్ ఏసీకి కచ్చితమైన కంట్రోల్ ఉంటుంది. విద్యుత్ కూడా ఆదా అవుతుంది.
పరిస్థితిని బట్టి అవసరమైనంత మేర కూలింగ్, హీటింగ్ చేయగలిగే విభిన్న స్పీడ్స్ ఉండే కంప్రెజర్.. ఇన్వర్టర్ ఏసీలో ఉంటుంది. ఇన్వర్టర్ ఏసీలో కంప్రెజర్ ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది. సాధారణ ఏసీలా కంప్రెజర్ తరచూ ఆన్ లేదా ఆఫ్ అవుతూ ఉండదు. దీని ద్వారా ఇన్వర్టర్ ఏసీ తక్కువ విద్యుత్‌ను వాడుకుంటుంది. అలాగే కంప్రెజర్‌కు ఎంత పవర్ అవసరమో అంతే సరఫరా చేస్తుంది.

నాన్ ఇన్వర్టర్ ఏసీ (Non Inverter Air Conditioner) అంటే..
ఇన్వర్టర్ టెక్నాలజీ లేని (నాన్ ఇన్వర్టర్) ఏసీల్లో ఒకే స్పీడ్ ఉండే కంప్రెజర్ మోటార్ ఉంటుంది. దీంతో ఫుల్ స్పీడ్‌లో రన్ అవడమో లేదా ఆగిపోవడమో.. ఈ రెండే జరుగుతాయి. పరిస్థితులను బట్టి స్పీడ్ మారే అవకాశం ఉండదు. దీంతో కావాలనుకున్న టెంపరేచర్‌కు రాగానే కంప్రెజర్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. మళ్లీ కావాల్సినప్పుడు ఆన్ అవుతుంది. ఇలా తరచూ ఆన్, ఆఫ్ కావడం వల్ల విద్యుత్ ఎక్కువ ఖర్చవుతుంది. అందుకే నాన్ ఇన్వర్టర్ ఏసీ ఎక్కువ పవర్‌ను వినియోగించుకుంటుంది. అదే ఇన్వర్టర్ ఏసీలో అయితే టెంపరేచర్‌ను బట్టి వివిధ స్పీడ్‌లలో కంప్రెజర్ నడుస్తూనే ఉంటుంది. ఆన్, ఆఫ్ అవ్వదు. అందుకే ఇన్వర్టర్ ఏసీ వల్ల విద్యుత్ కాస్త ఆదా అవుతుంది.
Also Read: కింద Refrigerator, పైన వాటర్ డిస్పెన్సర్ ఉండే ఈ 2 ఇన్ 1 గురించి తెలుసా.. ధర కూడా బడ్జెట్‌లోనే..
సాధారణంగా నాన్-ఇన్వర్టర్ ఏసీల కంటే ఇన్వర్టర్ ఏసీల ధర ఎక్కువగా ఉంటుంది. అయితే ఎక్కువ కాలం ఏసీ వాడాలనుకునే వారికి ఇన్వర్టర్‌దే బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘ కాలంలో నాన్ ఇన్వర్టర్‌తో పోలిస్తే ఇన్వర్టర్ ఏసీ వల్ల విద్యుత్ ఆదా అవుతుంది. ఉష్ణోగ్రతను బట్టి కంప్రెజర్ మోటర్ స్పీడ్‌లు మారే ఇన్వర్టర్ టెక్నాలజీ అనువుగా ఉంటుంది.
ఇన్వర్టర్ టెక్నాలజీ లేని ACs నుంచి శబ్దం కూడా ఎక్కువగా వస్తుంది. వాటితో పోలిస్తే ఇన్వర్టర్ ఏసీల శబ్దం చాలా తక్కువ.
ఎక్కువ వినియోగించే వారికి ఇన్వర్టర్ ఏసీనే బెస్ట్ ఆప్షన్‌ అని చెప్పవచ్చు. ఒకవేళ ఎప్పుడో ఒకసారి వాడేందుకు తక్కువ ధర ఏసీ కావాలంటే నాన్ ఇన్వర్టర్ ఏసీని పరిగణించవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.