యాప్నగరం

విమానంలో నుంచి కింద పడ్డ ఐఫోన్.. ఏమీ కాలేదు.. గాల్లో రికార్డు చేసిన వీడియో చూసి షాక్!

విమానంలో నుంచి కింద పడిన ఐఫోన్ పనిచేసిన ఘటన బ్రెజిల్‌లో జరిగింది. దాదాపు 2 వేల అడుగుల ఎత్తు నుంచి కిందపడినా ఈ ఫోన్‌కు ఏమీ కాకపోవడం విశేషం.

Samayam Telugu 30 Dec 2020, 3:47 pm
మన చేతుల్లో నుంచి అప్పుడప్పుడు ఫోన్లు కింద పడిపోతూ ఉంటాయి. అది సహజమే. మన టైం బాగుంటే ఫోన్ ఎంత ఎత్తు నుంచి పడినా ఏమీ కాదు. కానీ మన టైం బాగోకపోతే మాత్రం అలా చేయి జారి 1-2 అడుగుల ఎత్తు నుంచి పడినా.. డిస్ ప్లే పగిలిపోవడం, ఫోన్ పగిలిపోవడం వంటి దారుణాలు జరగవచ్చు. కానీ ఈ ఐఫోన్ అలా కాదు. ఏకంగా విమానంలో నుంచి కింద పడినా పగలలేదు. అవును.. మీరు చదివింది నిజమే దాదాపు 2000 అడుగుల ఎత్తున్న విమానంలో నుంచి కింద పడినా ఐఫోన్ పగల్లేదు.
Samayam Telugu iPhone 6s


Also Read: 2020లో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన ఫోన్లు ఇవే.. ఆ రెండు బ్రాండ్లదే డామినేషన్!

బ్రెజిలియన్ మీడియా అవుట్‌లెట్ జీ1 కథనం ప్రకారం బ్రెజిల్‌కు చెందిన డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఎర్నెస్టో గలియోటో తన ఐఫోన్ 6ఎస్‌లో వీడియో తీస్తూ లైట్ వెయిట్ ప్లెయిన్ ఎక్కాడు. అయితే అకస్మాత్తుగా చేయి జారి ఆ ఫోన్ కింద పడిపోయింది. విమానం కిటికిలో నుంచి అతను చేయి బయటకు పెట్టి వీడియో తీస్తూ ఉండగా, ఫోన్ తన చేయి జారి కింద పడిపోయింది.

అయితే ఫైండ్ మై ఫోన్ యాప్ ద్వారా ఆ ఫోన్ ఎక్కడుందో త్వరగానే గుర్తించారు. అక్కడికి వెళ్లి ఫోన్‌ను ఆయన తన చేతిలోకి తీసుకున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఫోన్‌కు ఒక గీత కూడా పడలేదు. సముద్రం ఒడ్డున ఉన్న పొదల్లో ఈ ఫోన్ పడింది. ఫోన్ నీటిలో పడకుండా ఒడ్డున పడితే అది దొరుకుతుందన్న నమ్మకం ఉందని ఎర్నెస్టో తెలిపారు. అదృష్టవశాత్తూ అది ఎవరికీ తగల్లేదని, 2000 అడుగుల ఎత్తు నుంచి పడింది కాబట్టి ఎవరి మీదైనా పడితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ఆయన పేర్కొన్నారు.

Also Read: నోకియా 5.4 వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!

ఈ ఫోన్‌కు అత్యంత బలమైన ఆర్మర్ కేస్ కూడా లేదని.. ఒక సిలికాన్ కేస్, ముందు ఒక సాధారణ స్క్రీన్ ప్రొటెక్టర్ మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. అంత ఎత్తు నుంచి పడినప్పటికీ ఫోన్‌కు ఎటువంటి నష్టం జరగలేదని, కేవలం స్క్రీన్ ప్రొటెక్టర్ మాత్రమే డ్యామేజ్ అయిందని ఆయన తెలిపారు. ఇది నిజంగా ఆశ్చర్యకరమే. ఎందుకంటే రెండు వేల అడుగుల ఎత్తు నుంచి కిందపడినా ఫోన్‌కు ఏమీ కాలేదంటే అది మామూలు విషయం కాదు. అంత ఎత్తు నుంచి వీడియో తీస్తూ ఉండగా ఫోన్ కింద పడింది. ఆ ఫోన్ గాల్లో ఉండగా కూడా రికార్డింగ్ చేస్తూనే ఉంది. కింద పడినప్పటికీ రికార్డింగ్ ఆగకపోవడం విశేషం. అంతసేపు తీసిన ఫుటేజ్ కూడా పోలేదు.

ఐఫోన్ 6ఎస్ ఇలా ప్రజలను ఆశ్చర్యపరచడం ఇదే మొదటిసారి కాదు. 2019లో కూడా ఒక ఫొటోగ్రాఫర్ ఫోన్ ఇలాగే విమానంలో నుంచి పడిపోయింది. ఆ ఫోన్ 13 నెలల తర్వాత దొరికినప్పటికీ అది పనిచేస్తూనే ఉండటం విశేషం. ఇది చదివి మీరు దీన్ని మీ ఐఫోన్ మీద ప్రదర్శించకండి. ఎందుకంటే అదృష్టం అందరికీ ఉండదు కదా! ఈ వీడియోను Ernesto Galiotto చానెల్లోకి వెళ్లి చూడవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.