యాప్నగరం

పండగ ఆఫర్ ను పొడిగించిన Jio.. Jio Phoneపై భారీ తగ్గింపు!

భారతదేశ టెలికాం దిగ్గజం జియో తాను దీపావళి సందర్భంగా అందించిన ఆఫర్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా తన జియో ఫోన్ పై భారీ తగ్గింపును అందించింది.

Samayam Telugu 4 Nov 2019, 3:30 pm
దీపావళి సందర్భంగా జియో తాను మొట్టమొదటగా విడుదల చేసిన జియో ఫోన్ పై భారీ తగ్గింపును అందించింది. అయితే ఈ ఆఫర్ కు భారీ స్థాయిలో స్పందన రావడంతో దీన్ని నవంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటంటే.. రూ.1,500 విలువ చేసే జియో ఫోన్ ను కేవలం రూ.699కే అందిస్తున్నారు. దీంతోపాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉన్న సమయంలో కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.693 విలువైన అదనపు లాభాలను అందించనున్నారు. అంటే ఒకరకంగా ఈ ఫోన్ ను ఉచితంగా అందిస్తున్నట్లే అన్న మాట!
Samayam Telugu Jio Phone Offer
Offers on Jio Phone


Also Read: All in One రీచార్జ్ లపై జియో డిస్కౌంట్.. Promocodeలు ఇవే!

గత మూడు వారాలలో అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ లో జియో ఫోన్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిందని జియో సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అందుకే ఈ ఆఫర్ ను నెలాఖరు వరకు పొడిగించినట్లు పేర్కొంది. దీపావళికి ముందు జియో ఫోన్ దీపావళి ఆఫర్ ను అందుకోలేకపోయిన వినియోగదారుల కోసం ఈ ఆఫర్ ని పొడిగించినట్లు జియో చెప్పింది.

Also Read: Rangoli, Flower స్టాంపులు కావాలా? అయితే ఇలా చేయండి!

అదనపు ప్రయోజనాలను పొందండిలా!
ఈ ఆఫర్ లో భాగంగా రూ.1,500 విలువ చేసే ఈ జియో ఫోన్ ను మీరు రూ.699కే పొందుతారు. మరి అదనంగా లభించే రూ.693 లాభాలను మీరు ప్రతినెలా రీచార్జ్ రూపంలో పొందవచ్చు. నెలకు రూ.99 విలువైన డేటాను ఏడు నెలల పాటు మీరు పొందుతారు. అయితే దీనికి మీరు ప్రతినెలా కనీసం రూ.99తో రీచార్జ్ చేయించాల్సి ఉంటుంది. అప్పుడు జియో మీకు అదనంగా మరో రూ.99 విలువైన డేటాను అందిస్తుంది. ఈ ఆఫర్ కోసం మీరు జియో సిమ్ ను కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Also Read: స్మార్ట్ ఫోన్ రంగంలోకి Tiktok సంస్థ ఎంట్రీ.. అదిరే ఫీచర్లతో మొదటి ఫోన్ లాంచ్!

జియో ఫోన్ స్పెసిఫికేషన్లు ఇవే!
ఈ జియో ఫోన్ KaiOS ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 2.4 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. 1.2 గిగా హెర్ట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ను ఇందులో కంపెనీ వారు అందించారు. ర్యామ్ 512 ఎంబీ కాగా, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంది. బ్యాటరీ సామర్థ్యం 2,000 ఎంఏహెచ్, వైఫై కనెక్టివిటీ సౌకర్యం కూడా ఇందులో ఉంది. జియో ఫోన్ లో గూగుల్ అసిస్టెంట్ అందుబాటులో ఉంది. 22 భారతీయ భాషలను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. కేబుల్ ద్వారా హెచ్ డీ టీవీలో ఇందులో ఉన్న కంటెంట్ నె ప్లే చేసుకోవచ్చు. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్ బుక్, గూగుల్ మ్యాప్స్ వంటి ప్రముఖ యాప్స్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. మైక్రో ఎస్ డీ కార్డు స్లాట్ ద్వారా 128 జీబీ మెమొరీ కార్డు వరకు ఇందులో వేసుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.