యాప్నగరం

Jio Independence Day Special Plan : ఒక్క రీచార్జ్‌తో రెండు ప్లాన్స్, జియో 2 ఇన్ 1.. బెనిఫిట్స్ భళా!

Reliance Jio New Plan : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో ఓ స్పెషల్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఒక్క రీచార్జ్‌తో రెండు ప్లాన్స్ అంటూ పేర్కొంది. ఏంటీ ప్లాన్‌.. బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి.

Authored byKrishna Prakash | Samayam Telugu 15 Aug 2022, 12:52 pm
ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) ఓ ప్రత్యేకమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా దీన్ని లాంచ్ చేసింది. జియో కొన్నిసార్లు విభిన్నమైన ప్లాన్‌లను తెస్తుంటుంది. ఇప్పుడు తాజాగా తీసుకొచ్చిన ఓ ప్రీపెయిడ్ ప్లాన్‌ మాత్రం వెరైటీగా ఉంది. ఒక్క రీచార్జ్‌తో రెండు ప్లాన్స్ అంటూ ఈ ప్రత్యేక ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.750 ధరతో ఈ కొత్త విధమైన ప్లాన్‌ను యూజర్లకు జియో అందుబాటులో ఉంచింది. ఈ కొత్త ప్లాన్‌తో లభించే బెనిఫిట్స్ ఎలా ఉన్నాయంటే..
Samayam Telugu Jio 2 in 1 New Prepaid Plan


Jio రూ.750 ప్లాన్‌
రిలయన్స్ జియో (Reliance Jio) కొత్తగా రూ.750 ధరతో ఓ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీన్ని 2 ఇన్ 1 ప్లాన్‌గా పేర్కొంది. ఒకటి రూ.749, దాంట్లోనే మరో ప్లాన్‌ను రూ.1గా తెలిపింది. మొత్తం మీద రూ.750 రీచార్జ్ చేసుకుంటే రెండు ప్లాన్స్ పొందవచ్చు.

రూ.750తో రీచార్జ్ చేసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీ దక్కుతుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతీ రోజు 100ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. ప్రతీ రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. దీనికి అదనంగా మరో 100ఎంబీ డేటా పొందవచ్చు.
ఈ బెనిఫిట్స్‌ను రెండు ప్లాన్స్‌గా జియో విడగొట్టింది. రూ.749 ప్లాన్‌తో ప్రతీ రోజు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు ఇస్తున్నట్టు, రూ.1 ప్లాన్‌తో ప్రతీ రోజు 100ఎంబీ డేటా అదనంగా అందిస్తున్నట్టు తెలిపింది. మొత్తంగా అయితే ఈ ప్రయోజనాలు దక్కాలంటే రూ.750 ప్లాన్‌ తీసుకోవాలి. ప్రస్తుతం ట్రెండింగ్ ప్లాన్‌గా ఇది ఉంది. (Jio Rs 750 Plan)

(Photo: Jio)

ఈ ప్లాన్‌ను తీసుకుంటే జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాప్స్‌ను ఉచితం యాక్సెస్ చేసుకోవచ్చు. రోజులో 2జీబీ+100ఎంబీ డేటా అయిపోయాక 64కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు.
మరి ఈ రూ.750 ప్లాన్‌ పరిమిత కాలం ఉంటుందా.. ఎప్పటికీ జియో కొనసాగిస్తుందా చూడాలి.
Also Read: Jio Plans : రోజుకు 2జీబీ డేటా లభించే జియో బెస్ట్ ప్లాన్స్ : ధరలు, బెనిఫిట్స్ ఎలా ఉన్నాయంటే..

మరోవైపు, ఈనెలలోనే 5జీ సర్వీస్‌లను లాంచ్ చేసేందుకు జియో సిద్ధమైంది. (Jio 5G launch) స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day 2022) సందర్భంగా ఆగస్టు 15వ తేదీనే 5జీ నెట్‌వర్క్ ప్రారంభం ఉంటుందని జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ఇటీవల సంకేతాలు ఇచ్చారు. ఇదే జరిగితే దేశంలో 5జీ లాంచ్ చేసిన తొలి టెలికం సంస్థగా జియో నిలిచే అవకాశం ఉంది. Also Read: Jio 5G : జియో నుంచి గుడ్‌న్యూస్ ఆ రోజే? ఆకాశ్ అంబానీ హింట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.