యాప్నగరం

Jio TV+: కొత్త యాప్ లాంచ్ చేసిన అంబానీ.. 12 ఓటీటీ యాప్స్ కంటెంట్ ఒకే యాప్‌లో!

ప్రముఖ టెలికాం ఆపరేటర్ జియో కొత్త యాప్ ను ప్రకటించింది. ఇందులో 12 ఓటీటీ యాప్స్ కంటెంట్ ఉండనుంది.

Samayam Telugu 15 Jul 2020, 5:50 pm
జియో తన సెట్ టాప్ బాక్స్ వినియోగదారుల కోసం జియో టీవీ+ అనే కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఒక్క యాప్ లోనే 12 ఓటీటీ యాప్స్ కంటెంట్ ఉండటం విశేషం. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్ స్టార్, వూట్, సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, జియో సినిమా, షెమారూ, జియో సావన్, యూట్యూబ్, ఎరోస్ నౌ యాప్స్ కంటెంట్ ను ఇందులో చూడవచ్చు.
Samayam Telugu Jio TV+ Launched


Also Read: Realme C11: రూ.7,500 లోపే రియల్‌మీ కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

ఈ కొత్త జియో టీవీ+ ప్లాట్ ఫాం ద్వారా వేర్వేరు యాప్స్ లోకి వేర్వేరుగా లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్న సింగిల్ క్లిక్ ప్రాసెస్ ద్వారా వినియోగదారులు వేర్వేరు యాప్స్ ను సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ సింగిల్ క్లిక్ ప్రాసెస్ పైన పేర్కొన్న 12 యాప్స్ కు మాత్రమే వర్తిస్తుంది.

దీంతోపాటు జియోటీవీ+ లో ఉన్న టాప్ మెనూ ద్వారా సినిమాలు, టీవీ షోలు, లైవ్ టీవీ, పిల్లలకు సంబంధించిన కంటెంట్, మ్యూజిక్ ఇలా వేర్వేరుగా సెర్చ్ చేసుకోవచ్చు. ఇందులో ఉండే వాయిస్ సెర్చ్ ద్వారా సినిమాలు, పాటలు, వీడియోలు, మ్యూజిక్ వీడియోలు, ట్రైలర్లను కూడా వీక్షించవచ్చు. ఇందులో ఉండే వాయిస్ సెర్చ్ ద్వారా యాక్టర్స్, డైరెక్టర్, జోనర్లు, నిర్మాతలకు సంబంధించిన కంటెంట్ ను ఎంచుకోవచ్చు.

Also Read: త్వరలో రానున్న నోకియా 2.4.. స్పెసిఫికేషన్లు కూడా లీక్!

దీంతోపాటు ఈ యాప్ ద్వారా లైవ్ టీవీ చానెళ్లను కూడా చూడవచ్చు. ఉదాహరణకు వినియోగదారులు పోల్ లో పాల్గొనడం ద్వారా తమకు ఇష్టమైన పోటీదారులకు రియాల్టీ షోల్లో ఓట్లు వేయవచ్చు. జియో సెట్ టాప్ బాక్స్ లో ప్రత్యేకంగా ఉండే జియో యాప్ స్టోర్ ద్వారా వేర్వేరు జోనర్లకు సంబంధించిన యాప్ లను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

దీనికి తోడు జియో యాప్ స్టోర్ లో యాప్స్ కోసం జియో డెవలపర్స్ ప్రోగ్రాం అనే కొత్త కార్యక్రమాన్ని కూడా అంబానీ ప్రారంభించారు. దీని ద్వారా డెవలపర్లు జియో యాప్ స్టోర్ లో యాప్స్ ను తయారు చేసి వాటిపై డబ్బు సంపాదించుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.