యాప్నగరం

Netflix ad-Supported Plans : తక్కువ ధర సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను తీసుకురానున్న నెట్‌ఫ్లిక్స్ - అధికారికంగా చెప్పిన సీఈవో

యాడ్స్‌తో కూడిన తక్కువ ధర ప్లాన్‌లను నెట్‌ఫ్లిక్స్ తీసుకురావడం ఖాయమైంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈవో టెడ్ సారండోస్ (Netflix CEO Ted Sarandos) ధ్రువీకరించారు. ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారో వివరించారు.

Edited byKrishna Prakash | Samayam Telugu 27 Jun 2022, 4:34 pm
Netflix ad-Supported Plans : పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ (Netflix) త్వరలోనే తక్కువ ధర సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను తీసుకురానుంది. ఇటీవల గణనీయంగా యూజర్లను కోల్పోతున్న నెట్‌ఫ్లిక్స్ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. ఉన్న యూజర్లను నిలుపుకొని.. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త తరహా ప్లాన్‌లను తీసుకురానుంది. సాధారణ ప్లాన్‌ల కంటే వీటి సబ్‌స్క్రిప్షన్ ధర తక్కువగా ఉండనుంది. అయితే ఈ తక్కువ ధర ప్లాన్స్‌లో యాడ్స్ ఉంటాయి. ఈ యాడ్ సపోర్టెడ్ ప్లాన్‌లను (Netflix Ad-supported Plans) నెట్‌ఫ్లిక్స్ తీసుకురానుందని కొంత కాలంగా సమాచారం వస్తుండగా.. ఇప్పుడు ఆ సంస్థ సీఈవో అధికారికంగా చెప్పారు.
Samayam Telugu Netflix Ad-Supported Plans


కేన్స్ లయన్స్ అడ్వర్టైజింగ్ ఫెస్టివల్ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సారండోస్ ( Netflix CEO Ted Sarandos ) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. నెట్‌ఫ్లిక్స్ వ్యూహాల గురించి వివరించారు. యాడ్ సపోర్టెడ్ ప్లాన్స్ ఎందుకు తీసుకురావాలని అనుకుంటున్నారో వివరించారు. “మేం చాలా భారీ కస్టమర్ సెగ్మెంట్‌ను విస్మరించాం. ‘నెట్‌ఫ్లిక్స్ చాలా ఖరీదుగా ఉంది, అడ్వర్టైజ్‌మెంట్స్ ఉన్నా మాకు ఇబ్బంది లేదు’ అనే వారిని ఇంత కాలం పట్టించుకోలేదు. అందుకే యాడ్స్‌తో కూడిన కొత్త టయర్ ప్లాన్స్‌ను యాడ్ చేస్తాం” అని నెట్‌ఫ్లిక్స్ సీఈవో సారండోస్ చెప్పారు. తాము నెట్‌ఫ్లిక్స్‌కు యాడ్స్ తీసుకురావడం లేదని, కేవలం కొత్తగా తెచ్చే తక్కువ ధర ప్లాన్‌లకు మాత్రమే యాడ్స్ ఉంటాయనేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. “మాకు యాడ్స్ ఉన్నా పర్వాలేదు, తక్కువ ధరకు ప్లాన్‌లు కావాలనే వారి కోసం ఈ టయర్‌ను యాడ్ చేస్తాం” అని అన్నారు.

ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో నెట్‌ఫ్లిక్స్ 2లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ఆదాయం భారీగా పడిపోయి కంపెనీ విలువ తగ్గింది. ఈ తరుణంలోనే దాదాపు ఆరునెలల్లోనే 600 మంది ఉద్యోగులను నెట్‌ఫ్లిక్స్ తొలగించింది. మళ్లీ వృద్ధి సాధించేందుకు ఏం చేయాలనే ఆలోచలను చేస్తోంది. అందులో భాగమే ఈ యాడ్ సపోర్టెడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్. ఇప్పటికే చాలా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు యాడ్స్‌తో కూడిన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ఇస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ కూడా తీసుకురానుంది.

ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌కు దాదాపు 22కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆ సంస్థలో సుమారు 11,000 మంది ఉద్యోగులు ఉన్నారని తెలుస్తోంది. అంటే గత ఆరు నెలల్లో రెండు శాతం మంది ఉద్యోగులను ఆ సంస్థ తొలగించింది. ఎంప్లాయిస్‌ను తీసేయాల్సిన పరిస్థితి రావడం పట్ల సీఈవో కూడా ఈ ఇంటర్వ్యూలో విచారం వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.