యాప్నగరం

UPI Charges : ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం సహా యూపీఐ ట్రాన్సాక్షన్స్‌పై చార్జీలు ఉంటాయా! క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

UPI Transaction Charges : యూపీఐ లావాదేవీలపై ప్రభుత్వం చార్జీలను విధించనుందన్న వార్తలు ఇటీవల బయటికి వచ్చాయి. తాజాగా ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది.

Authored byKrishna Prakash | Samayam Telugu 23 Aug 2022, 12:59 pm
Charges of UPI Transactions : యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ( Unified Payments Interface - UPI ) ట్రాన్సాక్షన్‌లపై ప్రభుత్వం చార్జీలు విధించనుందన్న సమాచారం ఇటీవల బయటికి వచ్చింది. అంటే ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం‌ సహా మిగిలిన ప్లాట్‌పామ్‌లలో యూపీఐ ట్రాన్సాక్షన్లు (UPI Transactions) చేస్తే ప్రభుత్వం.. చార్జీలు విధించనుందన్న విషయం చక్కర్లు కొట్టింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై స్పందించింది. యూపీఐ ట్రాన్సాక్షన్‌లపై చార్జీల విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.
Samayam Telugu Charges On UPI Transactions


యూపీఐ ట్రాన్సాక్షన్‌లపై ( UPI Transactions ) ఎలాంటి చార్జీలు విధించే అంశాన్ని పరిశీలించడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంటే యూపీఐ లావాదేవీలపై చార్జీలను ఇప్పట్లో విధించడం లేదని వెల్లడించింది. “ప్రజలకు, ఎకానమీ ఉత్పాదకత వృద్ధికి యూపీఐ చాలా అనుకూలంగా ఉంది. యూపీఐ సేవలపై చార్జీలు విధించాలన్న విషయాన్ని ప్రభుత్వం పరిగణించడం లేదు. సర్వీస్ ప్రొవైడర్ల ఖర్చుల భర్తీ విషయం కోసం వేరే మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది” అని ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది.
యూపీఐ ఆధారంగా చేసే ట్రాన్సాక్షన్‌లపై ( UPI Based Transactions ) చార్జీలను విధించే అంశం సాధ్యాసాధ్యాలపై వివిధ వర్గాల అభిప్రాయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కోరింది. విభిన్న మొత్తాల ట్రాన్సాక్షన్‌లపై చార్జీలను విధించే అంశంపై అభిప్రాయాలను చెప్పాలని అడిగింది. అయితే ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే యూపీఐ ట్రాన్సాక్షన్‌లపై చార్జీల విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రభుత్వం ఇప్పుడు స్పష్టం చేసింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసినా, స్వీకరించినా ప్రస్తుతం యూజర్లకు కానీ, మర్చంట్లకు గానీ ఎలాంటి చార్జీలు లేవు.

డిజిటల్ పేమెంట్స్‌కు మద్దతు కొనసాగిస్తామనేలా కేంద్ర ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. “గత సంవత్సరం డిజిటల్ పేమెంట్ ఎకో సిస్టమ్‌కు ఆర్థికంగా ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించింది. యూజర్ ఫ్రెండ్లీగా ఉన్న పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ల ప్రచారానికి చేయూతనందించింది” అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు వాడుతున్న ప్రతీ ఒక్కరూ యూపీఐ బేస్డ్ యాప్స్ వినియోగిస్తున్నారు. ఎక్కువ శాతం చెల్లింపులను వాటి నుంచే చేస్తున్నారు. పేమెంట్స్ చేయడంతో పాటు విద్యుత్ లాంటి బిల్లులను చెల్లిస్తున్నారు. యూపీఐ చెల్లింపులపై చార్జీలను విధించే విషయం తమ పరిగణనలోకి లేదని ఆర్థిక శాఖ చెప్పడం ప్రజలు ఊరట కలిగించే అంశమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.