యాప్నగరం

బంపరాఫర్‌తో నాయిస్ Smartwatch సేల్‌ షురూ - రూ.1,999కే సూపర్ ఫీచర్లతో - 15 నిమిషాలు చార్జ్ చేస్తే 1500 నిమిషాలు వినియోగించేలా..

మంచి స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో Noise ColorFit Pulse Grand సేల్‌ మొదలైంది. ఆకర్షణీయమైన పరిచయ ఆఫర్‌ అందిస్తోంది నాయిస్.

Samayam Telugu 18 Feb 2022, 6:10 pm
దేశీయ సంస్థ నాయిస్ (Noise) కొత్త స్మార్ట్‌వాచ్‌ నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ గ్రాండ్ (Noise ColorFit Pulse Grand) సేల్‌ మొదలైంది. హార్ట్ రేట్ సెన్సార్, SpO2 మానిటర్‌తో పాటు మరిన్ని హెల్త్ ఫీచర్లు, 60 విభిన్న స్పోర్ట్స్ మోడ్స్, ఫాస్ట్ చార్జింగ్ ఈ వాచ్‌లో ఉన్నాయి. మంచి స్పెసిఫికేషన్లు ఉన్న ఈ స్మార్ట్‌వాచ్‌ ఆకర్షణీయమైన ధరకు అందుబాటులోకి వచ్చింది. పరిచయ ఆఫర్‌ కింద భారీ తగ్గింపుతో Noise ColorFit Pulse Grand సేల్‌ మొదలైంది.
Samayam Telugu నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్‌వాచ్ (Image: Noise)
Noise ColorFit Pulse Grand Smartwatch

Noise ColorFit Pulse Grand స్మార్ట్‌వాచ్‌ ధర, సేల్‌, ఆఫర్‌
రూ.3999 ధర ఉన్న నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్‌వాచ్‌ను పరిచయ ఆఫర్‌ కింద రూ.1,999కే సేల్‌కు తీసుకొచ్చింది నాయిస్. అమెజాన్‌ (Amazon)తో పాటు నాయిస్ అధికారిక వెబ్‌సైట్‌ (gonoise.com) లో ఈ స్మార్ట్‌వాచ్‌ను రూ.1,999కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ పరిచయ ఆఫర్‌ ఎంత కాలం ఉంటుందో నాయిస్ వెల్లడించలేదు. మరోవైపు ఓలివ్ గ్రీన్, చాంపైన్ గ్రే, ఎలక్ట్రిక్ బ్లూ, జెట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో Noise ColorFit Pulse Grand లభ్యమవుతోంది.

Noise ColorFit Pulse Grand స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ గ్రాండ్ 1.69 ఎల్‌సీడీ టచ్ స్క్రీన్ డిస్‌ప్లే, రెక్టాంగులర్ డయల్‌తో వస్తోంది. హార్ట్ రేట్ మానిటర్, నిద్రను విశ్లేషించే స్లీప్ ట్రాకింగ్, ఒత్తిడిని తెలిపే స్ట్రైస్ మానిటర్, SpO2 హెల్త్ మానిటర్ ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు మొత్తంగా 60 ఫిట్‌నెస్‌, స్పోర్ట్స్ మోడ్స్ ఈ వాచ్‌లో లభిస్తాయి. వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కోసం ఐపీ68 రేటింగ్ ఉంటుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ మొబైళ్లకు బ్లూటూత్ ద్వారా ఈ స్మార్ట్‌వాచ్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందుకోసం నాయిస్ ఫిట్ యాప్‌ కూడా అందుబాటులో ఉంది.

Noise ColorFit Pulse Grand స్మార్ట్‌వాచ్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 7రోజుల పాటు వినియోగించుకోవచ్చు. ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ వల్ల 15 నిమిషాలు చార్జ్ చేసి దాదాపు 1500 నిమిషాలు (25 గంటలు) ఈ వాచ్‌ను వాడుకోవచ్చని నాయిస్ పేర్కొంది. ఇక బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయి ఉన్న ఫోన్‌ మ్యూజిక్, కెమెరాను కూడా కంట్రోల్ చేసే ఫీచర్ ఈ స్మార్ట్‌వాచ్‌లో ఉంది. అలాగే టైమర్, అలార్మ్, ఫ్లాష్‌లైట్ లాంటి ముఖ్యమైన టూల్స్ ఉన్నాయి.
Also Read: Redmi Smart Band Pro: ఆల్‌వేస్ ఆన్ డిస్‌ప్లే, మంచి బ్యాటరీతో రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో.. ధర ఎంతంటే?
Also Read: 24గంటల బ్యాటరీ లైఫ్, 10mm డ్రైవర్లతో కొత్త టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్.. రూ.1,499కే
Also Read: చైనీస్ కంపెనీలకు షాక్.. Smart Watchesలో భారత బ్రాండ్‌లదే ఆధిపత్యం - వృద్ధి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
Also Read: 108 ఎంపీ కెమెరా, అమోలెడ్ డిస్‌ప్లేతో రెడ్‌మీ నోట్ 11ఎస్ విడుదల.. నోట్ 11 కూడా.. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలివే
Also Read: మొబైల్‌ యూజర్లకు మళ్లీ భారీ షాక్ తప్పదా..? ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నుంచి ఇప్పటికే సంకేతాలు
Also Read: Reliance Jio: జియోకు షాక్! BSNL అదుర్స్
Also Read: Samsung : సామ్‌సంగ్ నుంచి బడ్జెట్ రేంజ్‌లో కొత్త 5జీ ఫోన్.. వచ్చేది ఆ రోజే! స్పెసిఫికేషన్లు, అంచనా ధర చూడండి
Also Read: వన్‌ప్లస్‌: MediaTek Dimensity 900 ప్రాసెసర్‌, 65W ఫాస్ట్ చార్జింగ్‌తో OnePlus Nord CE 2 5G లాంచ్..స్పెసిఫికేషన్లు, ధర ఎలా ఉన్నాయంటే..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.