నోకియా 5.4, నోకియా 3.4 స్మార్ట్ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లూ రూ.15 వేల రేంజ్‌లోనే వచ్చాయి. నోకియా 5.4లో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. నోకియా 3.4లో మూడు కెమెరాలు అందించారు. ఈ రెండిట్లోనూ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్లనే అందించారు. వీటిలో హోల్ పంచ్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనున్నాయి. వీటిని ఆండ్రాయిడ్ 11కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. నోకియా 5.4 ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.13,999గా నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.15,499గా నిర్ణయించారు. డస్క్, పోలార్ నైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్ కార్ట్, నోకియా ఇండియా వెబ్ సైట్లలో ఫిబ్రవరి 17వ తేదీ ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.
నోకియా 3.4 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చిన దీని ధరను రూ.11,999గా నిర్ణయించారు. చార్ కోల్, డస్క్, ఫోర్డ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. నోకియా వెబ్ సైట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌ల్లో ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
నోకియా 5.4 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.39 అంగుళాల హెచ్డీ+ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 19.5:9గా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉంది. దీన్ని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇక ముందువైపు హోల్ పంచ్ కటౌట్లో 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీన్ని ఆండ్రాయిడ్ 11కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చని నోకియా తెలిపింది. వైఫై, బ్లూటూత్ 4.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సెలరో మీటర్, గైరో స్కోప్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీంతోపాటు ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఇందులో ఉంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.87 సెంటీమీటర్లు కాగా, బరువు 181 గ్రాములుగా ఉంది.
నోకియా 3.4 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీన్ని ఆండ్రాయిడ్ 11కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చని నోకియా తెలిపింది. ఇందులో 6.39 అంగుళాల హెచ్డీ+ డిస్ ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 19.5:9గా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్‌పై నోకియా 3.4 పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉంది. దీన్ని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇక ముందువైపు హోల్ పంచ్ కటౌట్లో 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
దీని కనెక్టివిటీ ఫీచర్లు నోకియా 5.4 తరహాలోనే ఉన్నాయి. 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 5W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.87 సెంటీమీటర్లు కాగా, బరువు 180 గ్రాములుగా ఉంది.