యాప్నగరం

వాట్సాప్‌పేకు తొలగిన అడ్డంకులు.. అనుమతులు ఇచ్చిన ఎన్‌పీసీఐ! కానీ మొదట?

Whatsapp Pay: ఎన్‌పీసీఐ వాట్సాప్‌పేకు మనదేశంలో అనుమతులు ఇచ్చింది. అయితే 2 కోట్ల మంది యూజర్ల పరిమితిని విధించింది.

Samayam Telugu 6 Nov 2020, 11:00 am
వాట్సాప్ పే మనదేశంలో అధికారికంగా లాంచ్ అవ్వడానికి జాతీయ చెల్లింపుల కార్పొరేషన్(ఎన్‌పీసీఐ) అనుమతిని అందించింది. అయితే దశల వారీగా దీనికి అనుమతులు ఇచ్చినట్లు ఎన్‌పీసీఐ తెలిపింది. మొదట గరిష్టంగా 2 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్లతో ప్రారంభించడానికి అనుమతులు లభించాయి. పోల్చి చూడాలంటే ఫోన్‌పే ఈమధ్యే 25 కోట్ల యూజర్ల మార్కును దాటినట్లు ప్రకటించింది. దేశంలో జరిగే మొత్తం యూపీఐ లావాదేవీల్లో ఒక యాప్ ద్వారా 30 శాతం కంటే ఎక్కువ జరగకూడదనే నియమం త్వరలో అమల్లోకి రానుందని ఎన్‌పీసీఐ తెలిపింది.
Samayam Telugu Whatsapp


Also Read: అత్యంత చవకైన షియోమీ ల్యాప్‌టాప్ వచ్చేసింది.. ఈ ధరలో బెస్ట్!

దీంతో వాట్సాప్ పే మనదేశంలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నిజానికి ఇది మనదేశంలో ఎప్పుడో లాంచ్ కావాల్సింది. అయితే వాట్సాప్‌కు ఇప్పటికే మనదేశంలో 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నాయి. ఇది ఆ కంపెనీకి అదనపు లాభం అవుతుందని ఎన్నో కంపెనీలు భయపడ్డాయి.

ఈ సంవత్సరం మేలో మూడు బ్యాంకుల భాగస్వామ్యంత వాట్సాప్ పే లాంచ్ అవుతుందని 2020 ప్రారంభంలో వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించిన అనుమతులు మాత్రం రాలేదు. ఇప్పుడు ఎన్‌పీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దీనికి సంబంధించిన నిర్వహణను వాట్సాప్ త్వరలోనే ప్రారంభించనుంది. అయితే వినియోగదారుల విషయంలో పరిమితి విధించడంతో దీన్ని ఎంతమంది ఉపయోగిస్తారో తెలియరాలేదు.

వాట్సాప్ ఇటీవలే డిజప్పియరింగ్ మెసేజెస్ అనే కొత్త ఫీచర్‌ను కూడా లాంచ్ చేసింది. దీని సాయంతో వాట్సాప్ మెసేజ్‌లు వాటంతట అవే డిలీట్ అయ్యే విధంగా సెట్ చేయవచ్చు. మెసేజ్ పంపించిన వారం తర్వాత ఆ మెసేజ్ ఆటోమేటిక్‌గా డిలీట్ కానుంది.

Also Read: డిలీట్ చేయకుండా మెసేజ్‌లు మాయం చేయవచ్చు.. అదిరిపోయే ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్!

దీంతోపాటు వాట్సాప్ ద్వారా రోజుకు 10 వేల కోట్ల మెసేజ్‌లు డెలివర్ అవుతున్నట్లు ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. మిగతా మెసేజింగ్ ప్లాట్‌ఫాంలు దీని దరిదాపుల్లో కూడా లేవు. టెలిగ్రాం, మెసెంజర్, హైక్ ఇలా ఏ యాప్ తీసుకున్నా వాట్సాప్‌కు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.