యాప్నగరం

OnePlus : వన్‌ప్లస్‌ ఏస్ రేసింగ్ ఎడిషన్ లాంచ్ - అతి త్వరలోనే భారత్‌కు - ధర, స్పెసిఫికేషన్లు

OnePlus Ace Racing Edition launch : వన్‌ప్లస్‌ ఏస్ రేసింగ్ ఎడిషన్ మొబైల్‌ చైనాలో లాంచ్ అయింది. త్వరలోనే భారత్‌కు వేరే పేరుతో రానుంది. వన్‌ప్లస్‌ 10ఆర్ (OnePlus 10R) కంటే దీని ధర తక్కువగా ఉండనుంది.

Authored byKrishna Prakash | Samayam Telugu 17 May 2022, 11:42 pm
వన్‌ప్లస్‌ ఏస్ రేసింగ్ ఎడిషన్ ( OnePlus Ace Racing Edition ) స్మార్ట్‌ఫోన్‌ చైనాలో లాంచ్ అయింది. చైనాలో గత నెల వన్‌ప్లస్‌ ఏస్ (OnePlus Ace) విడుదలవగా.. ఇప్పుడు ఇదే సిరీస్‌లో రేసింగ్ ఎడిషన్ విడుదలైంది. వన్‌ప్లస్‌ ఏస్ ఫోన్‌ భారత్‌లో వన్‌ప్లస్‌ 10ఆర్‌ (OnePlus 10R)గా విడుదలైంది. రేసింగ్ ఎడిషన్ కూడా వేరే పేరుతో అతిత్వరలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. 10ఆర్‌తో పోలిస్తే ధర తక్కువగా ఉండనుంది. కాగా, వన్‌ప్లస్‌ ఏస్ రేసింగ్ ఎడిషన్ మొబైల్‌లో మీడియాటెక్ డైమన్సిటీ 8100-మ్యాక్స్ ప్రాసెసర్‌ ఉంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ఉండే LTPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. వన్‌ప్లస్‌ ఏస్ రేసింగ్ ఎడిషన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇవే.
Samayam Telugu వన్‌ప్లస్ ఏస్ రేసింగ్ ఎడిషన్ (Photo: OnePlus)
OnePlus Ace Racing Edition


వన్‌ప్లస్‌ ఏస్ రేసింగ్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు
OnePlus Ace Racing Edition Specifications | 6.59 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ LTPS LCD డిస్‌ప్లేతో వన్‌ప్లస్‌ ఏస్ రేసింగ్ ఎడిషన్ మొబైల్‌ వస్తోంది. 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ , 240Hz టచ్ సాంప్లింగ్ రేట్ ఉంటుంది. అలాగే మీడియాటెక్ డైమన్సిటీ 8100-మ్యాక్స్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్‌ రన్ అవుతుంది. గరిష్ఠంగా 12జీబీ ర్యామ్ ఉంటుంది.
OnePlus Ace Racing Edition వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్ 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉంటాయి. ఇక వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను వన్‌ప్లస్‌ ఇస్తోంది.
ఈ మొబైల్‌లో 5000mAh బ్యాటరీ ఉండగా, 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.3, GPS, NFC, USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి. పవర్ బటన్‌కే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

వన్‌ప్లస్‌ ఏస్ రేసింగ్ ఎడిషన్ ధర
OnePlus Ace Racing Edition Price | 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఉన్న వన్‌ప్లస్‌ ఏస్ రేసింగ్ ఎడిషన్ ధర 1,999 యువాన్లు (సుమారు రూ.23,000)గా ఉంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,199 యువాన్లు (సుమారు రూ.25,300), 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఉన్న టాప్‌ మోడల్ ధర 2,499 యువాన్లు (దాదాపు రూ.28,800)గా ఉంది. 200 యువాన్ల డిస్కౌంట్‌లో ఈ నెల 31న చైనాలో ఈ ఫోన్‌ సేల్‌కు వస్తుంది. అథ్లెటిక్స్ గ్రే, లైట్‌స్పీడ్ బ్లూ కలర్ వేరియంట్లలో లభ్యమవుతుంది.

వన్‌ప్లస్‌ ఏస్ రేసింగ్ ఎడిషన్ ఫోన్‌ అతిత్వరలోనే భారత్‌లో లాంచ్ కానుంది. అయితే వేరే పేరుతో వస్తుంది. వన్‌ప్లస్‌ 10ఆర్ సిరీస్‌లో భాగంగా కూడా రావొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.