యాప్నగరం

ఒప్పో ఏ15ఎస్ ధర లీకయింది.. రూ.12 వేల లోపే ఉండే అవకాశం!

ఒప్పో మనదేశంలో త్వరలో లాంచ్ చేయనున్న ఏ15ఎస్ స్మార్ట్ ఫోన్ ధర ఆన్ లైన్‌లో లీకైంది. దీని ధర రూ.11,490గా ఉండనుందని సమాచారం.

Samayam Telugu 15 Dec 2020, 8:50 pm
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మనదేశంలో త్వరలో ఒప్పో ఏ15ఎస్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుందని తెలుస్తోంది. దీని డిజైన్, స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. అంతేకాకుండా దీని ధర కూడా లీకవ్వడం విశేషం. మైస్మార్ట్ ప్రైస్ కథనం ప్రకారం ఈ ఫోన్ ధర రూ.11,490గా ఉండనుంది. ఇది 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర.
Samayam Telugu Oppo A15s


Also Read: రూ.12 వేల లోపే స్మార్ట్ టీవీ.. బడ్జెట్ టీవీలు లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్!

ఈ సంవత్సరం అక్టోబర్‌లో లాంచ్ అయిన ఒప్పో ఏ15ఎస్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ రానుంది. ఒప్పో ఏ15 రూ.10,990 ధరతో లాంచ్ అయింది. ఇందులో 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. లీకైన ప్రమోషనల్ పోస్ట్ ప్రకారం ఒప్పో ఏ15ఎస్ సిల్వర్ రంగులో రానుంది.

ఫోన్ కుడివైపు వాల్యూమ్, పవర్ బటన్లు ఉండగా, ఎడమవైపు సిమ్ స్లాట్ అందుబాటులో ఉంది. ఇందులో 6.52 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనకభాగంలో అందించారు.

అయితే ఫోన్ ప్రాసెసర్ గురించి ఎటువంటి వివరాలూ తెలియరాలేదు. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నట్లు కొన్ని లీకుల ద్వారా తెలుస్తోంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4230 ఎంఏహెచ్‌గా ఉండే అవకాశం ఉంది.

Also Read: గుడ్‌న్యూస్.. ఈ షియోమీ బడ్జెట్ ఫోన్‌పై ఏకంగా రూ.3,000 తగ్గింపు! ఇప్పుడు ఎంతంటే?

ఇందులో వెనకవైపు ఏఐ ట్రిపుల్ కెమెరా ఉండనుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉండనున్నాయి. ముందువైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించనున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.