ఒప్పో రెనో 6 సిరీస్ స్మార్ట్ ఫోన్లు మనదేశంలో జులై 14వ తేదీన లాంచ్ కానున్నాయి. ఒప్పో రెనో 6, ఒప్పో రెనో 6 ప్రో స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్‌లో లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని ఒప్పో తన అధికారిక ట్వీటర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. జులై 14వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు వీటి లాంచ్ జరగనుంది. ఒప్పో రెనో 6 సిరీస్ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. దీనికి సంబంధించిన మైక్రోసైట్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ క్రియేట్ చేసింది. ఒప్పో రెనో 6 చైనాలో 2,799 యువాన్ల(సుమారు రూ.31,860) ధరతో లాంచ్ అయింది. ఒప్పో రెనో 6 ప్రో స్మార్ట్ ఫోన్ ధర 3,499 యువాన్లుగా(సుమారు రూ.39,800) ఉంది. మనదేశంలో కూడా ఇదే రేంజ్లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఒప్పో రెనో 6 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.43 అంగుళాల ఫుల్హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 2400 x 1080 పిక్సెల్స్‌గా ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4300 ఎంఏహెచ్ కాగా, ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఒప్పో రెనో 6 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.55 అంగుళాల కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా ఇందులో అందించారు.
ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 65W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.