యాప్నగరం

ఏటీయం లేకుండా నగదు తీసుకోవచ్చు.. కొత్త ఫీచర్ ను తీసుకొచ్చిన Phonepe.. GooglePay, Paytmలకు షాక్!

ప్రముఖ ఆన్ లైన్ పేమెంట్స్ యాప్ ఫోన్ పే సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు చేతిలో ఏటీయం లేకపోయినా నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. మరి ఆ ఫీచర్ ను ఎలా పొందాలో తెలుసా?

Samayam Telugu 24 Jan 2020, 1:21 pm
డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే గురువారం తన ప్లాట్‌ఫామ్‌లో 'ఫోన్‌పే ఏటీయం' అనే ప్రత్యేక ఫీచర్ ను తీసుకువచ్చింది. నగదు అవసరం ఉన్న వినియోగదారులు తమకు సమీపంలో ఉన్న వ్యాపారుల నుంచి డబ్బును పొందేలా సాయపడుతుంది. అంటే మీకు నగదు కావాలనుకుంటే ఫోన్ పే యాప్ ద్వారా దగ్గరలో ఉన్న వ్యాపారుల నుంచి నగదును పొందవచ్చన్న మాట.
Samayam Telugu phonepe


Also Read: Samsung Vs OnePlus: ఈ ధరల శ్రేణిలో అత్యుత్తమ ఫోన్లు ఇవే! మరి వీటిలో బెస్ట్ ఫోన్ ఏది?

ప్రస్తుతానికి ఈ ఫీచర్ ను పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీ-ఎన్సీఆర్ లో మాత్రమే ప్రారంభించారు. త్వరలో దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఫీచర్ ను ఉపయోగించి ప్రస్తుతానికి కేవలం రూ.1,000 నగదును మాత్రమే తీసుకోగలం. త్వరలో ఈ మొత్తాన్ని కూడా పెంచుతారేమో చూడాలి మరి! మీరు ఎప్పుడైనా ఏటీయం మరిచిపోయి బయటకు వెళ్లినప్పుడు, లేకపోతే మీ చుట్టుపక్కల ఏటీయంలు లేనప్పుడు ఈ ఫీచర్ ను ఉపయోగించుకుని మీరు నగదును పొందవచ్చు.

Also Read: మరో లైట్ ఫోన్ ను లాంచ్ చేసిన Samsung.. ఫీచర్ల విషయంలో మళ్లీ సిక్సర్! ధర ఎంతంటే?

దీన్ని ఉపయోగించాలంటే కింద తెలిపిన ప్రక్రియను అనుసరించండి.

ముందుగా మీ ఫోన్ లో ఫోన్ పే యాప్ ను ఓపెన్ చేయండి.

పక్కనే ఉన్న స్టోర్స్ ట్యాబ్ పై క్లిక్ చేయండి

అందులో ఉన్న ఫోన్ పే ఏటీయం ఐకాన్ పై క్లిక్ చేయండి.

వెంటనే అక్కడ మీకు అందుబాటులో నగదును అందించే స్టోర్స్ కనిపిస్తాయి.

ఆ స్టోర్ కు వెళ్లి విత్ డ్రా బటన్ పై క్లిక్ చేయండి.

మీ ఫోన్ పే యాప్ ద్వారా ఆ వ్యాపారికి మీకు అవసరమైన మొత్తాన్ని చెల్లిస్తే అతను మీకు ఆ మొత్తానికి సమానమైన డబ్బును అందిస్తారు.

Also Read: డేటాను ఎక్కువగా వాడతారా? Jio, Airtel, Vodafoneల్లో ఈ ప్లాన్లు మీకోసమే! ఏది బెస్ట్ అంటే?

ఫోన్‌పే ఏటీయం వినియోగదారులకు విశ్వసనీయ వ్యాపార భాగస్వాముల ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా నగదును ఉపసంహరించుకునే వీలును కల్పిస్తున్నామని ఫోన్ పే ఈ సందర్భంగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సేవను పొందటానికి వినియోగదారులు, వ్యాపారుల నుంచి ఫోన్ పే ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు. అయితే విత్ డ్రా లిమిట్ మాత్రం.. ఆయా బ్యాంకులు నిర్దేశించిన విత్ డ్రా లిమిట్ కు లోబడి ఉంటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.