పోకో ఎం3 స్మార్ట్ ఫొన్ గత సంవత్సరం గ్లోబల్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రో వేరియంట్‌ను కంపెనీ రూపొందిస్తున్నట్లు సమాచారం. పోకో లాంచ్ చేసే మొదటి బడ్జెట్ 5జీ ఫోన్ ఇదే కానుంది. ఈ విషయాన్ని పోకో గ్లోబల్ అధికారులు తెలిపారు. దీనికి పోకో ఎం3 ప్రో 5జీ అని పేరు పెట్టనున్నారు. పోకో గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ షియాబో తెలిపారు. పోకో ఎం-సిరీస్ ఫోన్లలో ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ ప్లేను ఇందులోనే అందించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది 90 హెర్ట్జ్ డిస్ ప్లేనా, 120 హెర్ట్జ్ డిస్ ప్లేనా అన్నది తెలియరాలేదు. తక్కువ ధరలో 5జీని అందించడం తమ ఉద్దేశమని వారు పేర్కొన్నారు.
పోకో ఎం3 ప్రో లాంచ్ అయ్యే సమయానికి పోకో ఎక్స్3 ఎన్ఎఫ్సీని తాము నిలిపివేస్తామని కంపెనీ అధికారులు పేర్కొన్నారు. అప్పటికి ఈ రెండు ఫోన్లూ ఒకే ధరలో ఉంటాయని పేర్కొన్నారు. పోకో ఎం3 ప్రో 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది.
రెడ్ మీ నోట్ 10 5జీలో కూడా ఇదే ప్రాసెసర్‌ను అందించారు. కాబట్టి పోకో ఎం3 ప్రో 5జీని ఆ ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్ అనుకోవచ్చు. ఈ ఫోన్ మరికొన్ని నెలల్లో లాంచ్ కావచ్చు. దీనికి సంబంధించిన కచ్చితమైన తేదీ మాత్రం తెలియరాలేదు. త్వరలో పోకో ఫోన్లలో ఆసక్తికర ఫీచర్లను అందించనున్నాట్లు కంపెనీ అధికారులు పేర్కొన్నారు.
అయితే త్వరలో పోకో ఫ్లాగ్షిప్ ఫోన్ మాత్రం ఇప్పుడిప్పుడే లాంచ్ అయ్యే అవకాశం లేదని తెలిపారు. పోకో లాంచ్ చేసిన ఎఫ్3నే కంపెనీ చివరి స్మార్ట్ ఫోన్. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించారు. అయితే త్వరలో సూపర్ ఫ్లాగ్ షిప్ ఫోన్ రూపొందించడం మాత్రం ఖాయమని పేర్కొన్నారు.