యాప్నగరం

5G launched in India : దేశ టెక్నాలజీలో కొత్త ఆధ్యాయం.. 5జీ సర్వీస్‌లను లాంచ్ చేసిన ప్రధాని మోదీ

5G Services launched in India : భారత్‌లో 5జీ సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారభించారు. టెలికంతో పాటు చాలా రంగాల్లో కీలకంగా మారనున్న 5జీ సర్వీస్‌లను లాంచ్ చేశారు. పూర్తి వివరాలివే..

Authored byKrishna Prakash | Samayam Telugu 1 Oct 2022, 2:26 pm
5G Services launched in India : దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5జీ సేవలకు (5G Services) అంకురార్పన జరిగింది. 5జీ సర్వీస్‍‌లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) లాంచ్ చేశారు. సోమవారం (అక్టోబర్ 1) ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (India Mobile Congress)ను ప్రారంభించిన మోదీ… 5జీ సేవలను అధికారికంగా ఆవిష్కరించారు. దీంతో దేశ టెక్నాలజీలో సరికొత్త ఆధ్యాయం మొదలైంది. మొబైల్‌ కస్టమర్ల కోసం టెలికం సంస్థలు ఈనెలాఖరులో కమర్షియల్ 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ముందుగా కొన్ని మెట్రో నగరాల్లోని వినియోగదారులకు 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుంది.
Samayam Telugu 5G launched in India


ఇండియా మొబైల్‌ కాంగ్రెస్ (India Mobile Congress) ఆరో ఎడిషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం 5జీ సర్వీస్‌లను అధికారింగా లాంచ్ చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, రిలయన్స్ జియో సీఈవో ఆకాశ్ అంబానీ, ఎయిర్‌టెల్‌ చైర్మన్ సునీల్ మిట్టల్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5జీ పనితీరు గురించి ప్రధాని మోదీకి ఆకాశ్ అంబానీ వివరించారు. టెలికం, వైద్య, పారిశ్రామికం పాటు వివిధ రంగాల్లో 5జీ నెట్‌వర్క్‌తో మెరుగైన మార్పులు ఉండనున్నాయి. అధునాతన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌ ఈనెలాఖరులోగా 5జీ నెట్‌వర్క్‌ను కమర్షియల్‌గా లాంచ్ చేస్తాయి. ముందుగా కొన్ని ప్రధాన మెట్రో నగరాల్లో 5జీ సేవలు మొదలవుతాయి. ఆ తర్వాత క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. 4జీతో పోలిస్తే 5జీ నెట్‌వర్క్‌లో ఇంటర్నెట్ 10రెట్లు వేగంగా వస్తుందని అంచనాలు ఉన్నాయి. కాగా, రెండు సంవత్సరాల్లోగా దేశమంతా 5జీ నెట్‌వర్క్‌ను అందించాలని టెలికం సంస్థలు టార్గెట్‌గా పెట్టుకున్నాయి. మరోవైపు వొడాఫోన్ ఐడియా మాత్రం సందిగ్ధంలో ఉంది. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఆ సంస్థ.. 5జీ రోల్ అవుట్ గురించి స్పష్టంగా సంకేతాలు ఇవ్వడం లేదు.

5జీ వార్‌లో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌ తీవ్రంగా పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు టారిఫ్స్ దగ్గరి నుంచి 5జీని విస్తరించే వరకు పోటాపోటీగా ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నాయి. 5జీ యూజర్ల బేస్‌ను పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా దూసుకెళ్లనున్నాయి. ఇప్పటికే ఈనెలలోనే 5జీని తీసుకొస్తామని రెండు సంస్థలు ప్రకటించాయి. దీంతో ఈ నెలాఖరులోగా దేశంలో 5జీ కమర్షియల్ లాంచ్ కూడా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.