యాప్నగరం

రియల్‌మీ సీ11 లాంచ్ తేదీ వచ్చేసింది.. ఎప్పుడు రానుందంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సీ11ను జూన్ 30వ తేదీన లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇవే.

Samayam Telugu 25 Jun 2020, 7:22 pm
రియల్ మీ తన సీ11 స్మార్ట్ ఫోన్ ను మలేషియాలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ జూన్ 30వ తేదీన మలేషియాలో లాంచ్ కానుంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ తో లాంచ్ కానున్న మొదటి ఫోన్ ఇదేనని రియల్ మీ తెలిపింది. అయితే గతంలో రెడ్ మీ 9సీ స్మార్ట్ ఫోన్ కూడా ఇదే ప్రాసెసర్ తో లాంచ్ కానుందని వార్తలు వచ్చాయి.
Samayam Telugu Realme C11 Launch Date Confirmed


Also Read: గుడ్ న్యూస్.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.30 వేలు తగ్గింపు!

దీనికి సంబంధించిన రెండర్లు, కీలక స్పెసిఫికేషన్లు కూడా ఆన్ లైన్ లో లీకయ్యాయి. ఈ రెండర్ల ప్రకారం చూస్తే రియల్ మీ సీ11 పర్పుల్, గ్రీన్ రంగుల్లో లాంచ్ కానుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5 అంగుళాల మినీ-డ్రాప్ డిస్ ప్లేను ఇందులో అందించారు.

ఇంకో పోస్టర్ ప్రకారం చూస్తే ఇందులో రెండు కెమెరాల సెటప్ ఉంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ను ఇందులో అందించనున్నారు. వెనకవైపు 13 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫ్రంట్ కెమెరా గురించి ఎటువంటి వివరాలూ తెలియరాలేదు.

Also Read: బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన హానర్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

రియల్ మీ ఎక్స్3, ఎక్స్3 సూపర్ జూమ్, రియల్ మీ బడ్స్ క్యూలు ఈరోజు లాంచ్ అయ్యాయి. మనదేశంలో బడ్జెట్ ఫోన్లకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది కాబట్టి ఈ రియల్ మీ సీ11 స్మార్ట్ ఫోన్ కూడా అతి త్వరలో మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.