రియల్మీ సీ20ఏ స్మార్ట్ ఫోన్ బంగ్లాదేశ్‌లో లాంచ్ అయింది. దీని ముందు వెర్షన్ రియల్ మీ సీ20 జనవరిలోనే లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్న డిస్ప్లేనే అందించారు. ఇందులో వెనకవైపు, ముందువైపు ఒక్కో కెమెరానే అందుబాటులో ఉన్నాయి. రియల్మీ సీ20ఏ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. దీని ధరను 8,990 బంగ్లాదేశ్ టాకాలుగా(సుమారు రూ.7,900) నిర్ణయించారు. 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. లేక్ బ్లూ, ఐరన్ గ్రే రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. రియల్మీ సీ20 ధరను మనదేశంలో రూ.6,999గా నిర్ణయించారు. దీని ధర కూడా అదే రేంజ్లో ఉండే అవకాశం ఉంది.
రియల్ మీ సీ20 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720 x 1600 పిక్సెల్స్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. వెనకవైపు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, మైక్రో యూఎస్బీ పోర్టును ఇందులో అందించారు.
2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో పాటు యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.89 సెంటీమీటర్లుగానూ, బరువు 190 గ్రాములుగానూ ఉంది.